స్వచ్ఛమైన టమాటాలు మీ ఇంట్లోనే గుత్తులు గుత్తులుగా.. ఇలా చేస్తే చాలు..
14 July 2026
Krishna
టమాటా పెంపకంలో ముఖ్యమైన అడుగు మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడం. నమ్మకమైన నర్సరీల నుండి తెచ్చుకున్న విత్తనాలు లేదా ఇంట్లోనే బాగా పండిన నాణ్యమైన టమాటా గింజలను ఎండబెట్టి విత్తనాలుగా వాడుకోవచ్చు.
నాణ్యమైన విత్తనాలు
మొక్క బలంగా పెరగడానికి సారవంతమైన మట్టి అవసరం. సాధారణ మట్టితో పాటు సమాన పళ్లాలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కొద్దిగా కొబ్బరి పొట్టు కలిపి కుండీలను లేదా గ్రో బ్యాగులను సిద్ధం చేసుకోవాలి.
మట్టి మిశ్రమం
సిద్ధం చేసుకున్న మట్టిలో విత్తనాలను అర ఇంచు లోతులో నాటాలి. విత్తనాలు మొలకెత్తే వరకు మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా 5 నుండి 7 రోజుల్లో చిన్న చిన్న మొలకలు బయటకు వస్తాయి.
విత్తనాలు నాటడం
మొలకలు వచ్చి, మొక్క 4, 5 ఆకుల దశకు చేరుకున్నప్పుడు, వాటిని తీసి పెద్ద కుండీలలో లేదా నేలపై దూరదంగా నాటుకోవాలి. దీనివల్ల వేర్లు బాగా విస్తరించి మొక్క బలంగా ఎదుగుతుంది.
మొక్కలను వేరు చేయడం
టమాటా మొక్కలకు నీరు చాలా ముఖ్యం, కానీ ఎక్కువ అవ్వకూడదు. రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మట్టి తేమను బట్టి నీరు పోయాలి. కుండీ అడుగున నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం.
సరైన నీళ్లు
టమాటా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, ఎక్కువ పూత పూయడానికి ఎండ చాలా అవసరం. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో ఈ మొక్కలను ఉంచాలి.
సూర్యరశ్మి
టమాటా మొక్కలు కొంచెం పెద్దవయ్యాక కాయల బరువుకు కిందకు వంగిపోతాయి. అలా జరగకుండా ఉండటానికి మొక్క పక్కన ఒక బలమైన కర్రను పాతి, దానికి మొక్కను తాడుతో లూజ్‌గా కట్టాలి. దీనివల్ల మొక్క నిటారుగా నిలబడుతుంది.
కర్రల మద్దతు
కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే తయారుచేసిన వేప నూనె స్ప్రే లేదా పుల్లటి మజ్జిగను మొక్కలపై చల్లితే తెగుళ్లు రావు. కొన్ని వారాల్లోనే పూత పిందెగా మారి, ఎలాంటి రసాయనాలు లేని తాజా టమాటాలు మీ చేతికి అందుతాయి.