వీడియోలతో ప్రియుడి బ్లాక్ మెయిల్.. 14వ అంతస్తు నుంచి దూకిన యువతి!
అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడాలో ఒక యువతి 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రేమికుడు మోహిత్ మక్వానా, అతని స్నేహితుడు ఆమెను అశ్లీల వీడియోతో బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదు. వేధింపులు కొనసాగడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక యువతి భవనం 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. ఆ అమ్మాయి మోహిత్ మక్వానా అనే యువకుడితో ప్రేమలో ఉంది. మోహిత్, అతని స్నేహితులలో ఒకరు కలిసి ఆ అమ్మాయిని అశ్లీల వీడియో చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోకు సంబంధించి ఆ అమ్మాయి గతంలో సోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ప్రియుడు మోహిత్ సమక్షంలోనే పోలీసులు ఆ వీడియోను తొలగించారని తెలిసింది.
అయితే ఆ తర్వాత కూడా నిందితుడు ఆ అమ్మాయిని మళ్లీ బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నాడు. అంతకుముందు ఆ అమ్మాయి తన ప్రేమికుడికి రూ.6,000 ఇచ్చి, తన బంగారు గొలుసును కూడా ఇచ్చింది. కానీ అతని వేధింపులు ఆగకపోవడంతో ధైర్యం కోల్పోయి చివరికి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి