AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: స్కూల్‌ కారిడర్‌లో ‘కీ’స్‌ తిప్పుతూ నడుచుకుంటూ వెళ్తున్న 10th క్లాస్‌ బాలిక.. అంతలో ఊహించని సీన్‌!

ఓ ప్రైవేట్‌ పాఠశాలలో లంచ్ టైం కావడంతో విద్యార్ధులంతా అటూఇటూ తిరుగుతున్నారు. అయితే ఇంతలో ఓ పదో తరగతి విద్యార్ధిని కారిడర్‌లో చేతిలో కీస్‌ (తాళం చెవి) పట్టుకుని తిప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ.. ఒక్కసారిగా రోలింగ్‌ ఎక్కి నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకేసింది. ఈ షాకింగ్‌ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో జులై 25న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Watch Video: స్కూల్‌ కారిడర్‌లో 'కీ'స్‌ తిప్పుతూ నడుచుకుంటూ వెళ్తున్న 10th క్లాస్‌ బాలిక.. అంతలో ఊహించని సీన్‌!
Ahmedabad Class 10 Student Suicide
Srilakshmi C
|

Updated on: Jul 27, 2025 | 3:14 PM

Share

అహ్మదాబాద్‌, జులై 27: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురా ప్రాంతంలోని సోమ్ లలిత్ ప్రైవేట్‌ స్కూల్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియో.. విద్యార్థిని నాలుగో అంతస్తు లాబీలో కీ రింగ్ చేతి వేలితో తిప్పుతూ నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా విద్యార్ధిని రైలింగ్‌పైకి ఎక్కి కిందకి దూకేసింది. గమనించిన తోటి విద్యార్ధులు పరుగున బాలికను పట్టుకునేందుకు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. పాఠశాలలో మధ్యాహ్నం లంచ్‌ టైంలో విరామం ఈ సంఘటన జరిగింది.

విద్యార్థిని దూకిన తర్వాత పాఠశాలలోని ఇతర విద్యార్ధులు భయంతో కేకలు వేస్తూ రైలింగ్ వైపు పరుగులు తీశారు. పై నుంచి దూకడంతో విద్యార్ధిని తలకు బలమైన గాయం తగిలింది. చేతులు, కాళ్ళ ఎముకలు విరిగిపోయాయి. వెంటనే స్కూల్‌ యాజమన్యం బాలికను సమీపంలోని నిధి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలికను ఆమె తల్లిదండ్రులు తల్తేజ్‌లోని మరొక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మరణించింది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాఠశాల మేనేజర్ ప్రజ్ఞేష్ శాస్త్రి మాట్లాడుతూ.. విద్యార్థిని గత 5 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో చదువుతోందని, ఇటీవల నెల సెలవులు తీసుకుందని, 10 రోజుల క్రితమే పాఠశాలకు తిరిగి వచ్చిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి సంఘటన జరిగిన రోజు ఉదయం ఆమెను పాఠశాలలో దింపినట్లు వెల్లడించారు. క్లాస్‌ రూంలో మృతి చెందిన విద్యార్ధిని వింతగా ప్రవర్తించేదని, ఉన్నట్లుండి అకస్మాత్తుగా అరిచేదని తెలిపారు. దీనిపై నవరంగ్‌పురా పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు కొంతమంది విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.