International Flights: అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పునరుద్దరణ

|

Mar 26, 2022 | 10:03 PM

International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. విదేశాలకు వెళ్లే వరకు దీంతో చాలా రిలీఫ్‌ కలిగింది. రెండేళ్ల తరవాత ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసులను..

International Flights: అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పునరుద్దరణ
Follow us on

International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. విదేశాలకు వెళ్లే వరకు దీంతో చాలా రిలీఫ్‌ కలిగింది. రెండేళ్ల తరవాత ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసులను పునరుద్దరించారు. దీంతో అంతర్జాతీయ (International)ప్రయాణికులకు శుభవార్త అందినట్లయ్యింది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత అంతర్జాతీయ విమాన సర్వీసు (International Flights) లను పునరుద్దరించింది కేంద్రం. ఇవాళ అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. international passenger flights పై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎత్తివేసింది. కరోనా కార‌ణంగా అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. ఆంక్షల కారణంగా ఎయిర్‌లైన్స్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయాయి. అంతేకాకుండా కరోనా ఉధృతి కూడా తగ్గడంతో ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ పెరగిన క్రమంలో సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల తర్వాత సర్వీసులపై నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించారు. భారత్ కు వచ్చే.. భారత్ నుంచి వెళ్లే అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించినట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. రెండేళ్ల కిందట కొవిడ్ విలయం, గతేడాది ఒమిక్రాన్ విజృంభణ కారణంగా భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే, అత్యవసర సేవల నిమిత్తం వివిధ దేశాలతో చేసుకున్న ఎయిర్ బబుల్‌ ఒప్పందాల మేరకే ఈ రెండేళ్లపాటు కొద్ది సంఖ్యలోనే విమానాలు తిరిగాయి. కరోనా తర్వాతి కాలంలో రెగ్యులర్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసెంజర్ విమానాలపై నిషేధం కొనసాగింది. చివరిసారిగా ఫిబ్రవరి 28న కూడా నిషేధాన్ని పొడిగించిన కేంద్రం.. తాజా ప్రకటనతో నిషేధం ఎత్తివేసింది.

ఆఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బహ్రయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవూస్, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజేరియా, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక, స్విట్జర్లాండ్, తంజానియా, ఉక్రెయిన్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్ దేశాలతో ఎయిర్ ట్రాన్స్‌పోర్టు బబుల్ అగ్రిమెంట్‌ను భారత్ కుదుర్చుకుంది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్న తరుణంలో విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త చెబుతూ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

Russia Central Bank: కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నాలు.. పుతిన్‌కు షాకిచ్చిన హ్యాకర్లు..!

Temperature: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హీట్‌స్ట్రోక్‌తో ప్రమాదం.. నిపుణుల సలహాలు, సూచనలు