ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కళ్యాణ మండపంలో ఘోరం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వధూవరులపై యాసిడ్ వేసి పరారయ్యాడు. ఈ ఘటనలో వధువరులు, ఇద్దరు పిల్లలతో సహా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీతా కశ్యప్ (19) వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఇదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి వేధికపై ఉన్న వధూవరులపై యాసిడ్ పోశాడు. యాసిడ్ వధువరులతోపాటు వారి పక్కనున్న వారిపై కూడా పడింది. దీంతో పెళ్లి మండపంలో తోపులాట జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పెళ్లి వేడుకలో కరెంట్ పోయిన సమయంలో ఈ దాడి జరగడంతో ఎవరు దాడి చేశారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై భాన్‌పురి పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.