AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ‘అబీ పిక్చర్ బాకీ హై’.. పాక్‌కు భారత్ బిగ్ వార్నింగ్.. భారత్ మాజీ ఆర్మీ చీఫ్ సంచలన ట్వీట్

'ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌తో పాక్ వెన్నులో వణుకు పట్టుకుంది. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని భారత 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ సరవణె ట్వీట్ చేశారు.

Operation Sindoor: 'అబీ పిక్చర్ బాకీ హై'.. పాక్‌కు భారత్ బిగ్ వార్నింగ్.. భారత్ మాజీ ఆర్మీ చీఫ్ సంచలన ట్వీట్
Manoj Mukund Narvane
Ravi Kiran
|

Updated on: May 07, 2025 | 11:08 AM

Share

‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌తో పాక్ వెన్నులో వణుకు పట్టుకుంది. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని భారత 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ సరవణె ట్వీట్ చేశారు. ‘అబీ పిక్చర్ బాకీ హై’ అని ఆయన ట్వీట్ చేయడం.. అలాగే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే మరిన్ని మెరుపు దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుండటంతో.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే దాకా ఇవి జరగడం ఖాయమని స్పష్టమవుతోంది.

ప్రతీకారం తీర్చుకున్న భారత్ సైన్యం..

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బిహార్‌లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి మరీ ఎటాక్ చేసిన భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్‌ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్‌ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్‌ చేసింది. ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు. కాసేపట్లో CCS కీలక భేటీ జరగనుంది. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత నుంచి 3 సార్లు CCS మీటింగ్ జరిగింది.సీసీఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది.

ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష చేశారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధానితో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌. ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగానే ‘జైహింద్’ అంటూ రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. లష్కరే తోయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతం కాగా.. మరో ఉగ్ర నేత ముదాసిర్‌ మృతి చెందాడు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ చెక్‌పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్‌ సైన్యం కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత్‌ ఆర్మీని ఎదురుకోలేక సామన్య ప్రజలపై కాల్పులు జరుపుతోంది పాక్‌ సైన్యం. కశ్మీర్‌ సహా ఎల్‌వోసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతోంది.

యూరీ, కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. పాక్‌ సైన్యం కాల్పులను తిప్పికొడుతోంది భారత బలగాలు. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. కాల్పుల్లో పలువురు సైనికులకు కూడా గాయాలు అయ్యాయి. భారత్ మెరుపు దాడితో కాళ్లబేరానికి వచ్చారు పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌. భారత్‌ దాడులు ఆపేస్తే మేం ప్రతీకారానికి దిగమని పాక్‌ రక్షణమంత్రి ప్రకటించారు. లాహోర్‌, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలను మూసివేశారు.

ఆపరేషన్‌ సింధూర్‌పై అమిత్‌షా స్పందించారు. పహల్గామ్‌ దాడికి ప్రతిస్పందనే ఆపరేషన్‌ సింధూర్‌ అంటూ కేంద్ర హోంమంత్రి పోస్ట్‌ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు అమిత్‌షా. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర్‌ చేపట్టినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌పై ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. పాక్‌ పౌరస్థావరాలకు నష్టం కలగకుండా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు.

Follow Us
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
ఈ చిన్న ట్రిక్​తో ప్రాబ్లమ్ సాల్వ్..!
ఈ చిన్న ట్రిక్​తో ప్రాబ్లమ్ సాల్వ్..!
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్