AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: గవర్నమెంట్ జాబ్ వచ్చిందని భర్తనే వదిలేసింది.. న్యాయం చేయాలంటూ పోలీసులకు ఆశ్రయించిన భర్త

అతడు ప్రభుత్వోద్యోగి.. ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి వేచి చూస్తోంది. ఈ క్రమంలో వారికి పెళ్లి సంబంధం కుదరడంతో పెళ్లికి ఓకే చెప్పి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది. ఆ క్రమంలో ఆమెకు పోలీస్ శాఖలో....

Crime: గవర్నమెంట్ జాబ్ వచ్చిందని భర్తనే వదిలేసింది.. న్యాయం చేయాలంటూ పోలీసులకు ఆశ్రయించిన భర్త
Wife Escape From Husband
Ganesh Mudavath
|

Updated on: Jul 27, 2022 | 8:17 PM

Share

అతడు ప్రభుత్వోద్యోగి.. ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి వేచి చూస్తోంది. ఈ క్రమంలో వారికి పెళ్లి సంబంధం కుదరడంతో పెళ్లికి ఓకే చెప్పి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది. ఆ క్రమంలో ఆమెకు పోలీస్ శాఖలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇక అంతే.. ఆమెలో దుర్బుద్ధి రేగింది. జాబ్ వచ్చిందన్న ఆలోచనతో భర్తను వదిలేయాలని నిర్ణయించుకుంది. కట్టుకున్న భర్తను వదిలేసి, భర్తను ఒంటరివాడిని చేసింది. బిహార్ (Bihar) లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిహార్ లోని మాధేపురా జిల్లా కేదార్ ఘాట్ ప్రాంతంలో నివాసముండే మిథున్.. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్దమవుతుతున్న సమయంలో హర్‌ప్రీతి అనే యువతితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా చివరికి ప్రేమగా మారింది. మిథున్ కు ఉద్యోగం రావడంతో ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి భార్య హర్‌ప్రీతికి కూడా పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. సమస్తిపూర్ జిల్లా పటౌరీ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించి, విధులు నిర్వహిస్తోంది.

అప్పటివరకు బాగానే ఉన్న హర్ ప్రీతికి విచిత్ర ఆలోచన కలిగింది. జాబ్ రావడంతో భర్తను కాదని అతనిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. హర్ ప్రీతి ఇలా చేయడాన్ని మిథున్ తట్టుకోలేకపోయాడు. తనతోనే ఉండాలని కోరాడు. కానీ ఆమె మాత్రం అతనితో ఉండేందుకు ఇష్టపడలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ ఆధారంగా అధికారులు విచారణ చేపడుతున్నారు.

హర్‌ప్రీత్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు రూ.10-15 లక్షలు ఖర్చు చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. ఈ వ్యాఖ్యలను హర్ ప్రీత్ ఖండించింది. మిథున్ తన వద్ద నుంచి రూ.25లక్షలు డిమాండ్ చేశాడని, అవి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి