
కర్నాటక రాజధాని బెంగళూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ హైక్లాస్ అపార్ట్‌మెంట్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిపై అపార్ట్‌మెంట్ వాసి ఒకరు దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఇంతకీ వారు ఎందుకు కొట్టారంటే.. అక్కడి ప్యాసింజర్ లిఫ్ట్ ఎక్కడమే ఆ పిజ్జా డెలివరీ బాయ్ చేసిన తప్పట. అయితే, ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
కాగా, తాము వాడే లిఫ్ట్ నువ్వు ఎక్కుతావా? అంటూ పిజ్జా డెలివరా బాయ్‌పై దాడికి దిగాడా? లేక ఆ పిజ్జా బాయ్ ఏదైనా అమర్యాదగా ప్రవర్తించాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, గొడవ సమయంలో పిజ్జా బాయ్ కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేసినా.. ఆ రెసిడెంట్ ఎదురుదాడి ముందు నిలవలేకపోయాడు. అయితే, గొడవకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..