Snakes Revenge: పాములు పగబడతాయా..! నిద్రిస్తున్న అన్నదమ్ములను కాటేసి చంపిన జంట పాములు.. తండ్రిపై దాడికి యత్నం..

|

Sep 25, 2023 | 1:08 PM

జంట పాములు కాటు వేయడంతో ఇద్దరు చిన్నారులు నిద్రలోనే మరణించారు. దీంతో ఆ కుటుంబం మాత్రమే కాదు ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. పిల్లల మరణం నుంచి ఇంకా తేరుకోక ముందే ఆ చిన్నారుల తండ్రిని కూడా పాములు కాటు వేయడానికి ప్రత్నించాయి. తర్వాత గ్రామస్థులు పాములను పట్టుకునేవారి సహాయంతో అతి కష్టం మీద ఆ జంట పాములను పట్టుకున్నారు.

Snakes Revenge: పాములు పగబడతాయా..! నిద్రిస్తున్న అన్నదమ్ములను కాటేసి చంపిన జంట పాములు.. తండ్రిపై దాడికి యత్నం..
A Pair Of Cobra
Follow us on

పాములు పగబడతాయని హిందువుల నమ్మకం.. అది నిజం కాదంటూ సైన్స్ ..హేతువాదుల వాదన.. నమ్మకం సైన్స్ కు మధ్య జరిగే విచిత్ర సంఘటలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. జంట పాములు కాటు వేయడంతో ఇద్దరు చిన్నారులు నిద్రలోనే మరణించారు. దీంతో ఆ కుటుంబం మాత్రమే కాదు ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. పిల్లల మరణం నుంచి ఇంకా తేరుకోక ముందే ఆ చిన్నారుల తండ్రిని కూడా పాములు కాటు వేయడానికి ప్రత్నించాయి. తర్వాత గ్రామస్థులు పాములను పట్టుకునేవారి సహాయంతో అతి కష్టం మీద ఆ జంట పాములను పట్టుకున్నారు. ఈ వింత ఘటన పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

 మంచం మీద నిద్రిస్తున్న పిల్లలు 

ఈ సంఘటన ప్రతాప్‌గఢ్‌లోని లాల్‌గంజ్ కొత్వాలోని ధాధువా గజన్ గ్రామంలో జరిగింది. గ్రామంలో నివసించే బబ్లూ యాదవ్ పని నిమిత్తం బయట నివసిస్తున్నాడు. అయితే బబ్లూ భార్య  తన ఇద్దరు పిల్లలు 9 ఏళ్ల అగం, 7 ఏళ్ల అర్నవ్  తో కలిసి గ్రామంలో నివసిస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి బబ్లూ ఇంట్లోకి జంట నాగుపాముల ప్రవేశించాయి. అవి నేరుగా మంచంపై నిద్రిస్తున్న ఇద్దరు అన్నదమ్ములను కాటేశాయి. పాములు కాటేసిన వెంటనే అన్నదమ్ములిద్దరూ భయంతో తీవ్రంగా కేకలు వేశాడు. అప్పుడు కొడుకుల అరుపులు విన్న బబ్లూ భార్య పరుగుపరుగున పిల్లల రూమ్ వైపు పెరిగెట్టింది. అప్పుడు పిల్లల రూమ్ నుంచి జంట నాగుపాములు బయటకు రావడం చూసింది.  వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు పిల్లల్ని పాములు కరిచిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు మొదట పిల్లలకు భూతవైద్యం చేసి తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పిల్లలు ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.. ఇది విన్న కుటుంబంలో విషాదం నెలకొంది. కుమారులు మరణించారన్న వార్తను వేరే ఊరిలో ఉన్న బబ్లూకి అందించారు.

ఇవి కూడా చదవండి

మల విసర్జనకు వెళ్లిన తండ్రిపై కూడా దాడి  

కుమారుల మరణవార్త విని ఇంటికి చేరుకున్న బబ్లూ.. తన చిన్నారుల మృతదేహాలను చూసి స్పృహతప్పి పడిపోయాడు. అయితే గ్రామస్తులు బబ్లూ, అతని భార్యకు దైర్యం చెప్పారు.. ఊరడించారు. సెప్టెంబరు 20న మలవిసర్జన కోసం బయటకు వచ్చిన బబ్లూపై చెట్టు మీద నుంచి దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే బబ్లూని పాము కాటువేయలేకపోయింది. కానీ భయంతో బబ్లూ అక్కడే స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పిల్లల మృతితో విషయంలో ఉన్న ఆ కుటుంబం.. బబ్లూ మీద కూడా పాములు దాడి చేయడంతో ఆ కుటుంబం ఇంకా తేరుకోలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..