Temple For Alien: ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?

అయితే వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్ప‌టికీ ఏలియ‌న్స్ నిజంగా ఉన్నాయ‌ని విశ్వ‌సించే వారు చాలా మంది ఉన్నారు. శాస్త్ర‌వేత్త‌లు సైతం ఈ విష‌యాన్ని బ‌లంగా విశ్వ‌సిస్తుంటారు. అయితే ఓ వ్య‌క్తి ఏకంగా ఏలియ‌న్స్‌కి గుడి క‌ట్టించేశాడు..

Temple For Alien: ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?
Temple for alien
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2024 | 8:08 AM

గ్ర‌హాంత‌రవాసులు.. ఈ పేరు విన‌గానే ఏదో తెలియని ఉత్సుక‌త మ‌దిలో మెదులుతుంది. ఏలియ‌న్స్ భూమిపైకి వ‌స్తుంటాయ‌ని ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని ఎన్నో సినిమాలు కూడా వ‌చ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా ఏలియ‌న్స్‌పై ప్ర‌యోగాలు చేస్తున్నార‌ని. అక్క‌డ కొన్ని ఏలియ‌న్స్‌ను సైతం బంధించార‌ని ఇలా ఎన్నో పుకార్లు, షికార్లు చేస్తూనే ఉంటాయి.

అయితే వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్ప‌టికీ ఏలియ‌న్స్ నిజంగా ఉన్నాయ‌ని విశ్వ‌సించే వారు చాలా మంది ఉన్నారు. శాస్త్ర‌వేత్త‌లు సైతం ఈ విష‌యాన్ని బ‌లంగా విశ్వ‌సిస్తుంటారు. అయితే ఓ వ్య‌క్తి ఏకంగా ఏలియ‌న్స్‌కి గుడి క‌ట్టించేశాడు. హీరోయిన్ల‌కు గుడులు నిర్మించి పూజించే వారిలో ముందు వ‌రుస‌లో ఉండే త‌మిళ‌నాడులోనే ఏలియ‌న్‌కి కూడా గుడి నిర్మించ‌డం విశేషం.

త‌మిళ‌నాడులోని సేలం జిల్లాలోని మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్‌కు చెందిన లోగనాథన్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల శివాల‌యాన్ని నిర్మించాడు. అందులో శివ‌లిగంతోపాటు ప‌క్క‌నే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలను ప్రతిష్టించారు. దేవుళ్లతోపాటు గ్రహాంతరవాసి ప్రతిమకూ లోగనాథన్ పూజలు చేస్తున్నాడు. 2021లో మొద‌లు పెట్టిన ఈ గుడి నిర్మాణం తాజాగా పూర్త‌యింది. గుడిలో ఏలియ‌న్ విగ్ర‌హం ప్ర‌తిష్టించ‌డంతో ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ప్ర‌పంచంలో ఇలా ఒక ఏలియ‌న్ విగ్ర‌హానికి పూజ‌లు చేయ‌డం ఇదే తొలిసారి. అయితే తాను గ్ర‌హంతర వాసుల‌తో మాట్లాడి, వారి నుంచి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే గుడిని నిర్మించిన‌ట్లు లోగనాథన్ తెలిపారు. ప్రపంచంలో ప్రకృతి వైపరిత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని తాను నమ్ముతున్నాన‌ని అన్నారు.

మ‌రిన్ని జాతీయ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..