Doctor: వైద్యుడికీ తప్పని కులవివక్ష.. వెక్కివెక్కి ఏడ్చిన వైనం.. మార్పు ఎన్నటికి వచ్చెనో..

|

Sep 03, 2022 | 12:05 PM

కులవివక్ష (Caste Discrimination) పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న మొన్నటి వరకు మారుమూల గ్రామాలకే పరిమితమైన ఈ ఝూడ్యం ఇప్పుడు పట్టణాలు, నగరాలకు వ్యాపిస్తోంది. అందరూ సమానమేననే భావనను...

Doctor: వైద్యుడికీ తప్పని కులవివక్ష.. వెక్కివెక్కి ఏడ్చిన వైనం.. మార్పు ఎన్నటికి వచ్చెనో..
Doctor
Follow us on

కులవివక్ష (Caste Discrimination) పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న మొన్నటి వరకు మారుమూల గ్రామాలకే పరిమితమైన ఈ ఝూడ్యం ఇప్పుడు పట్టణాలు, నగరాలకు వ్యాపిస్తోంది. అందరూ సమానమేననే భావనను మరిచిపోయి కొందరు అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. తమదే ఎక్కువ కులం అని రెచ్చిపోతున్నారు. తమ కంటే తక్కువ కులం వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. గ్రామాల నుంచి వెలేసిన ఘటనలు కూడా మనం ఎన్నో చూశాం. కానీ.. కులమత బేధాలు లేకుండా అందరి ప్రాణాలు రక్షించే వైద్యుడికీ (Doctor) కులవివక్ష తప్పలేదు. ఆస్పత్రిలో తన విధులను సరిగా చేసుకోనివ్వడం లేదని, తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఒక్కసారిగా బావూరుమన్నాడు. గుండెల్లో దాచుకున్న దుఖాన్ని తట్టుకోలేక ఏడ్చేశాడు. హరియాణా రాష్ట్రం భివానీ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి వైద్యం చేయడం ఆయన బాధ్యత. కొద్ది రోజులుగా ఆయనకు ఆస్పత్రిలో వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఆయనకు ఆస్పత్రిలో కూర్చునేందుకు స్థలం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులను చూడాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కుల వివక్షతోనే ఇదంతా చేస్తున్నారని వాపోయారు.

ధర్మేంద్ర స్వస్థలం బిహార్. బాగా వైద్యం చేస్తూ భివానీ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. అందువల్ల డాక్టర్ తన రోగులకు వైద్యం చేయలేకపోతున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఒక్కసారిగా ఏడ్చేశారు. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి అధికారులకు వైద్యుడు ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. దీనికి భిన్నంగా ఆస్పత్రి అధికారులు స్పందించారు. ఆస్పత్రి సిబ్బందితో ధర్మేంద్ర అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. వారిని తిట్టాడని చెప్పారు. ధర్మేంద్రపై మరో వైద్యుడు మనీశ్ షియోరన్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. నిజానిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..