ఆర్టికల్ 370 థాలీ.. రూ.370 డిస్కౌంట్
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 370 ఆర్టికల్ రద్దు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ఆర్డోర్ 2.1 రెస్టారెంట్..జమ్మూకశ్మీర్ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల రుచులందించే సూపర్ సైజ్ ఆర్టికల్ 370 థాలిపై 370 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఐడీ చూపిస్తే ప్రత్యేక తగ్గింపుతో ఆర్టికల్ 370 థాలిని అందిస్తోంది. వెజ్ […]
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 370 ఆర్టికల్ రద్దు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ఆర్డోర్ 2.1 రెస్టారెంట్..జమ్మూకశ్మీర్ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల రుచులందించే సూపర్ సైజ్ ఆర్టికల్ 370 థాలిపై 370 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఐడీ చూపిస్తే ప్రత్యేక తగ్గింపుతో ఆర్టికల్ 370 థాలిని అందిస్తోంది. వెజ్ థాలి ధర రూ. 2,370 కాగా..నాన్ వెజ్ థాలి ధర రూ.2,669గా నిర్ణయించింది. వెజ్ మెనూల్ కశ్మీరీ పులావ్, ఖమీర్ కి రోటీ, నద్రు కీ షమీ, దమ్ ఆల్, కహ్వా ఉంటాయి. ఇక నాన్ వెజ్ మెనూలో కశ్మీరీ పులావ్, ఖమీర్ కి రోటీ, నద్రు కి షమీ, రోగన్ జోష్, కహ్వా ఉన్నాయి.