Anurag Thakur: కోడ్ ఉల్లంఘనతో 9 న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేత.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

|

Aug 03, 2022 | 6:22 AM

ప్రోగ్రామ్, అడ్వర్టైజింగ్ కోడ్ ఉల్లంఘన కారణంగా 2017 - 2022 మధ్య తొమ్మిది టెలివిజన్ ఛానెల్‌లు ప్రసారాలను నిలిపివేసినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపారు.

Anurag Thakur: కోడ్ ఉల్లంఘనతో 9 న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేత.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
Minister Anurag Thakur(File Photo)
Follow us on

TV channels taken off air for code violation: ప్రోగ్రామ్, అడ్వర్టైజింగ్ కోడ్ ఉల్లంఘన కారణంగా 2017 – 2022 మధ్య తొమ్మిది టెలివిజన్ ఛానెల్‌లు ప్రసారాలను నిలిపివేసినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మంగళవారం తెలిపారు. 2021-22లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Intermediary Guidelines and Digital Media Ethics Code) నిబంధనల ప్రకారం 94 యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెల్‌లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. ఠాకూర్ ఈ వివరాలను వెల్లడించారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 2017 – 2022 మధ్యకాలంలో 11 పాటలకు సర్టిఫికేషన్ నిరాకరించిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఠాకూర్ పలు విషయాలను వెల్లడించారు.

ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా.. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జనవరిలో బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC)ని పునర్నిర్మాణ దశలు, వ్యవస్థలు, ప్రక్రియలను దృష్టిలో ఉంచుకుని వార్తల రేటింగ్‌లను పునఃప్రారంభించవలసిందిగా కోరిందని ఠాకూర్ చెప్పారు. వార్తలు, ప్రత్యేక ఆసక్తి గల శైలి కోసం సమర్థవంతమైన నమూనా పరిమాణాన్ని పెంచడానికి, డేటాలో సంబంధిత లోపాలను తగ్గించడానికి BARC ‘నాలుగు వారాల రోలింగ్ యావరేజ్’ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిందని తెలిపారు.

TRP కమిటీ, ప్రసార రంగ నియంత్రణ సంస్థ అయిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సిఫార్సులను అనుసరించి కార్పొరేట్ గవర్నెన్స్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు, పారదర్శకత కోసం BARC పలు చర్యలు తీసుకుందని ఠాకూర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి