Tragedy: అయ్యో భగవంతుడా.. మీ పిల్లలు జాగ్రత్త.. ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకున్న 8 నెలల పాపాయి..

షాక్ కొట్టగానే పాపను పేరెంట్స్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది.  పాప ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు నిర్ధారించారు. పాప ఫాదర్ సంతోష్ కల్గుట్కర్.. హుబ్లీ విద్యుత్ సప్లై కంపెనీ.. హెస్కామ్‌లో కాంట్రాక్ట్ ఎంప్లాయిగా వర్క్ చేస్తున్నాడు. పాప చనిపోయిన విషయం తెలిసిన వెంటన అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని ఫ్యామిలీ మెంబర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్​కు తీసుకెళ్లారు.

Tragedy: అయ్యో భగవంతుడా.. మీ పిల్లలు జాగ్రత్త.. ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకున్న 8 నెలల పాపాయి..
Phone Charger (Representative image)

Updated on: Aug 02, 2023 | 7:42 PM

 కర్ణాటక, ఆగస్టు 2: మనం పరధ్యానంతో  చేసే కొన్ని పనులు పెను ప్రమాదాలను తీసుకువస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. క్రిమిసంహరక మందులు, ఎలుకలు, బొద్దింకల మందులు, పెట్రోల్, కిరోసిన్ డబ్బాలు వంటివి వారికి దగ్గరిగా ఉంచకూడదు. అలానే కరెంట్ వైర్లు వంటివి వారికి అందేలా ఉంచకూడదు. ఇక చార్జెర్ పిన్నులు మనం అలా పెట్టి వదిలేస్తాం. వాటివల్ల ఏమి అవుతుందిలే అనుకుంటాం. అలా చేయడం ఓ ప్రాణం పోవడానికి కూడా కారణం కావొచ్చు. తాజాగా కర్నాటక రాష్ట్రం.. ఉత్తర కన్నడ జిల్లాలో అదే జరిగింది. కర్వార్ తాలుకా సిద్ధార్ ఏరియాలో నివాసం ఉండే సంతోష్ కల్గుట్కర్, సంజనా కల్గుట్కర్​ దంపతుల 8 నెలల కుమార్తె.. బుధవారం ఛార్జర్ పిన్​తో ఆడుకుంది. ఆ సమయంలో ఛార్జర్.. సాకెట్​కే పెట్టి ఉంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. స్విచ్ కూడా వేసే ఉంది. చిన్నారి ఆడుతూ.. ఆడుతూ ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకుంది. దీంతో కరెంట్ షాక్​కు కొట్టి.. ఆ చిట్టి తల్లి ప్రాణాలు విడిచింది.

షాక్ కొట్టగానే పాపను పేరెంట్స్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది.  పాప ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు నిర్ధారించారు. పాప ఫాదర్ సంతోష్ కల్గుట్కర్.. హుబ్లీ విద్యుత్ సప్లై కంపెనీ.. హెస్కామ్‌లో కాంట్రాక్ట్ ఎంప్లాయిగా వర్క్ చేస్తున్నాడు. పాప చనిపోయిన విషయం తెలిసిన వెంటన అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని ఫ్యామిలీ మెంబర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్​కు తీసుకెళ్లారు. అతడు అనారోగ్యానికి గురయ్యాయడని డాక్టర్లు  వెల్లడించారు.

చనిపోయిన పాప పేరు సంధ్య అని పోలీసులు వివరించారు. సంతోష్ కల్గుట్కర్, సంజనా కల్గుట్కర్​ కపుల్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. సంధ్య మూడో కుమార్తె అని వివరించారు. బుధవారం మరో తనయ బర్త్ డే అని వివరించారు. ‘కుమార్తె పుట్టిన రోజు కాబట్టి అంతా  హ్యాపీగా ఉన్నారు. ఆ లోపే ఈ విషాదం జరిగింది’ అని పోలీసులు చెప్పారు. ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్​లో కేసు ఫైల్ అయిందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..