కాశ్మీర్ లో లష్కరే ‘ క్రీనీడ ‘.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్..

కాశ్మీర్ లో లష్కరే ' క్రీనీడ '.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్..

జమ్మూ కాశ్మీర్లో ‘ లష్కరే ‘ క్రీనీడలు కనబడుతున్నాయి. దొంగచాటుగా ఎలా ప్రవేశించారో8 మంది లష్కరే ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో ఎంటరయ్యారు. దక్షిణ కాశ్మీర్లోని సోపోర్ లో స్థానికులను భయపెడుతూ.. బెదిరింపు పోస్టర్లను సర్క్యులేట్ చేస్తున్న వీరిని పోలీసులు, భద్రతా దళాలు అరెస్టు చేశారు. పోస్టర్లను తయారు చేసేందుకు వినియోగించే కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టణంలో టెర్రరిస్టులు ఓ చిన్నారితో సహా నలుగురిని గాయపరచిన రెండు రోజుల అనంతరం ఈ […]

Pardhasaradhi Peri

|

Sep 10, 2019 | 12:29 PM

జమ్మూ కాశ్మీర్లో ‘ లష్కరే ‘ క్రీనీడలు కనబడుతున్నాయి. దొంగచాటుగా ఎలా ప్రవేశించారో8 మంది లష్కరే ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో ఎంటరయ్యారు. దక్షిణ కాశ్మీర్లోని సోపోర్ లో స్థానికులను భయపెడుతూ.. బెదిరింపు పోస్టర్లను సర్క్యులేట్ చేస్తున్న వీరిని పోలీసులు, భద్రతా దళాలు అరెస్టు చేశారు. పోస్టర్లను తయారు చేసేందుకు వినియోగించే కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టణంలో టెర్రరిస్టులు ఓ చిన్నారితో సహా నలుగురిని గాయపరచిన రెండు రోజుల అనంతరం ఈ ఎనిమిది మందీ పట్టుబడ్డారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు, అవసరమైతే ఆత్మాహుతికి సిధ్ధపడేందుకు వీరు ప్రయత్నించారని పోలీసువర్గాలు తెలిపాయి. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఆదేశాలపై వీరు పోస్టర్లను రూపొందించారట. ఇలా ఉండగా కెరన్ సెక్టార్లో నియంత్రణ రేఖను దాటి జమ్మూకాశ్మీర్లో ప్రవేశించబోయిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ బృందం చేసిన ప్రయత్నాలను భారత సైన్యం వమ్ము చేసింది. ఆగస్టు మొదటివారంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను సైన్యం తాజాగా విడుదల చేసింది. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ కు చెందిన అయిదుగురి మృతదేహాలను, వారి తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక్కడ ఉగ్రవాద దాడి జరగవచ్ఛునని తమకు సమాచారం అందిందని, అందువల్ల కనీవినీ ఎరుగని భద్రతను కల్పించామని వారు చెప్పారు. గుజరాత్ లోని సర్ క్రీక్ జలసంధి వద్ద ఉగ్రవాదులు వదిలి వెళ్లిన కొన్ని పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వారు పేర్కొన్నారు.

ఇలా ఉండగా పాక్ ఆధీనంలోని పీఓకే వద్ద సుమారు వందమంది పాక్ కమెండోలు, టెర్రరిస్టులు ‘ మోహరించి ‘ ఉన్నారని, ఏ క్షణంలోనైనా వారు నియంత్రణ రేఖ దాటి దొంగచాటుగా కాశ్మీర్లోకి ప్రవేశించవచ్ఛునని, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆర్మీ అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో కేంద్రం అదనపు బలగాలను ఈ రాష్ట్రానికి పంపినట్టు తెలుస్తోంది. అలాగే స్థానికుల్లో ఎవరైనా రహస్యంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్నారా అన్నది కూడా ఆరా తీస్తున్నారు. కాశ్మీర్ యువతలో అనేకమంది లష్కరే తోయిబా ఉగ్రవాదుల సిధ్ధాంతాల పట్ల ఆకర్షితులై.. టెర్రరిస్టులుగా మారవచ్ఛునని, అందువల్ల సదా వారిపై నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి వారిని ఆకర్షించేందుకు జైషే మహమ్మద్, లష్కరే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మారు మూల ప్రాంతాల్లోని యువతను టార్గెట్ చేసుకుని తమ కార్యకలాపాలను కాశ్మీర్లో విస్తరించేందుకు పాక్ గడ్డ పై నుంచే ఈ సంస్థలు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్నీ రద్దు చేసి,, ఈ రాష్ట్రాన్ని రెండుభాగాలుగా కేంద్రం వేరు చేసినప్పటినుంచి.. పాక్ ప్రేరేపిత సంస్థలు రెచ్చిపోతున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu