AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother@70 Years: ఏడు పదుల వయసులో అమ్మగా ప్రమోషన్‌ పొందింది!

పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మవ్వాలని కోరుకుంటారు. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని ఆరోగ్య కారణాలతో  చాలామంది ఆ అదృష్టానికి నోచుకోలేకపోతుంటారు.

Mother@70 Years: ఏడు పదుల వయసులో అమ్మగా ప్రమోషన్‌ పొందింది!
Mother N
Basha Shek
|

Updated on: Oct 20, 2021 | 1:22 PM

Share

పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మవ్వాలని కోరుకుంటారు. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని ఆరోగ్య కారణాలతో  చాలామంది ఆ అదృష్టానికి నోచుకోలేకపోతుంటారు. దీంతో మాతృత్వానికి నోచుకోలేదని తమలో తాము తీవ్రంగా మథనపడిపోతుంటారు. ఇదిలా ఉంటే ఏడు పదుల వయసులో అమ్మగా ప్రమోషన్‌ పొందారు గుజరాత్‌కు చెందిన జివున్‌ బెన్‌ రబరి. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకునే వయసులో సిజేరియన్‌ ద్వారా బిడ్డను ప్రసవించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఈ క్రమంలో ప్రపంచంలో అతి పెద్ద వయసులో తల్లైన మహిళల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌లోని మోరా గ్రామానికి చెందిన జివున్‌ బెన్‌ వయసు సుమారు 70 ఏళ్లు. ఆమె భర్త మల్ధారికి 75 ఏళ్లు. 45 ఏళ్లుగా కలిసి కాపురం చేస్తున్నారు. అయితే అమ్మానాన్నలయ్యే అదృష్టానికి మాత్రం నోచుకోలేకపోయారు. చివరకు భుజ్‌లోని ఓ ఐవీఎఫ్‌(ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌) కేంద్రాన్ని ఆశ్రయించారు.

పిల్లల్ని కనడం సాధ్యం కాదని చెప్పాం..కానీ! పెళ్లయిన సుమారు 45 ఏళ్ల తర్వాత సిజేరియన్‌ ద్వారా పండంటి మగబిడ్డను ప్రసవించారు జివున్‌ బెన్‌. తద్వారా తన మాతృత్వపు కలను సాకారం చేసుకున్నారు. తన ముద్దుల కుమారుడికి ‘లాలో’ అని పేరు పెట్టుకున్న ఆమె తన వయసు 70 ఏళ్లని, అయితే అందుకు తగిన ఆధారాలు తన వద్ద లేవంటున్నారు. ‘ జివున్‌ దంపతులు ఏడాదిన్నర క్రితం మా దగ్గరికొచ్చారు. అయితే ఈ వయసులో పిల్లల్ని కనడం సాధ్యం కాదని, ప్రాణానికి కూడా ప్రమాదకరమని హెచ్చరించాం. అయినా వారు మా దగ్గరికి వస్తూనే ఉన్నారు. సుమారు 3 నెలల పాటు కౌన్సెలింగ్‌ ఇస్తూనే ఉన్నాం. అయితే వాళ్ల కుటుంబంలో చాలామంది లేటు వయసులోనే తల్లిదండ్రులయ్యారని వారు చెప్పారు. దీంతో మేం మొదట ఆమె మెన్‌స్ట్రువల్‌ సైకిల్‌ను పునరుద్దరించేందుకు కొన్ని మందులిచ్చాం. అదే విధంగా నిత్యం ఆమె ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నాం. ఇటీవల సిజేరియన్‌ శస్ర్తచికిత్స నిర్వహించి ఆమెకు అమ్మయ్యే భాగ్యాన్ని కల్పించాం. నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇది అరుదైన ఘటన’ అని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు చెప్పుకొచ్చారు.

Also Read: T 20 WorldCup: ‘పాకిస్తాన్‎తో ఆడే భారత్ జట్టు ఇదేనా’.. స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Australia Cricket Team: యాషెస్ సిరీస్‌ ముందు ఆస్ట్రేలియాకు షాకిచ్చిన కీలక బౌలర్..!