Australia Cricket Team: యాషెస్ సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు షాకిచ్చిన కీలక బౌలర్..!
యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక బౌలర్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో ఇంగ్లండ్ సిరీస్ ముందు షాక్ తగిలింది.
James Pattinson: ఆస్ట్రేలియా బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. యాషెస్‌కు ముందు, అతను జట్టులోని ముఖ్యమైన బౌలర్‌లలో ఒకడు కావడంతో అతని నిర్ణయం ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. ప్యాటిన్సన్ చాలా కాలంగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. 31 ఏళ్ల ప్యాటిన్సన్.. మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్‌తో పాటు అనేక సీజన్లలో ఆస్ట్రేలియా తరఫున బౌలింగ్ చేశాడు. అతను చాలా కాలంగా జట్టులో రెగ్యులర్ పార్ట్ టైం బౌలర్‌గా ఉన్నాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరికైనా విశ్రాంతి ఇచ్చినప్పుడు మాత్రమే ప్యాటిన్సన్‌కు జట్టులో అవకాశం లభించేంది. ఈ విషయం అతనిని ఎంతగానో బాధపెట్టింది. 2020 సంవత్సరంలో ఐపీఎల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో ప్యాటిన్సన్ భాగమయ్యాడు.
2013 భారతదేశ పర్యటన చిరస్మరణీయం.. ప్యాటిన్సన్‌కు 2013లో భారత పర్యటన చాలా చిరస్మరణీయమైనదిగా మిగిలింది. అయితే, ఈ పర్యటన తర్వాత, అతను జట్టు నుంచి తొలగించారు. 2013 సంవత్సరంలో చెపాక్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అతను భారత్‌పై ఐదు వికెట్లు పడగొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, మురళీ విజయ్, చేతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజాలను పెవిలియన్‌కు చేర్చాడు. చెన్నైలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఐదు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. అయితే, గాయం కారణంగా, అతను ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీని తర్వాత జట్టు సమీక్ష సమావేశంలో పాల్గొననందుకు అతడిని సస్పెండ్ చేశారు. దీని కోసం అతను బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు.
అతను ఇటీవల తన పదవీ విరమణ గురించి బోర్డుకు సూచించాడు. ‘వయసు పెరుగుతున్న కొద్దీ క్రికెట్‌ని ఆస్వాదించడం చాలా కష్టం. ఈ ఏడాది నాకు చాలా ముఖ్యం. ఒకవేళ నాకు జట్టులో చోటు దక్కితే, అప్పుడు నేను నా సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది జరగకపోతే నేను నా ఆటను ఆస్వాదించడంపై దృష్టి పెడతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్యాటిన్సన్ 2011 లో న్యూజిలాండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 3.22 ఎకానమీ రేటుతో 81 వికెట్లు పడగొట్టాడు. అతను 15 వన్డే మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను నాలుగు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. అందులో మూడు వికెట్లు తీసుకున్నాడు.