Viral Fever: ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు.. వింత వ్యాధితో 70 మంది చిన్నారుల మృత్యువాత..

|

Sep 02, 2021 | 6:32 AM

Viral Fever: ఓ వైపు కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. మరోవైపు అంతుచిక్కని వైరల్ ఫీలర్ చిన్నారులను బలితీసుకుంటోంది. ఈ గుర్తు తెలియని మాయదారి రోగం కారణంగా

Viral Fever: ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు.. వింత వ్యాధితో 70 మంది చిన్నారుల మృత్యువాత..
Viral Fever
Follow us on

Viral Fever: ఓ వైపు కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. మరోవైపు అంతుచిక్కని వైరల్ ఫీలర్ చిన్నారులను బలితీసుకుంటోంది. ఈ గుర్తు తెలియని మాయదారి రోగం కారణంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ముందు ముందు ఇంకెంత మంది చనిపోతారో అని భయంతో బతుకుతున్నారు అక్కడి జనాలు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వారిలో అధిక జ్వరం, రక్తంలో ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడం, కొందరిలో తీవ్రమైన నిర్జలీకరణ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు ధృవీకరిస్తున్నారు. మాయదారి జ్వరం కారణంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిధిలో ఇప్పటి వరకు 70 మంది వరకు చిన్నారులు చనిపోగా.. వీరిలో ఒక్క ఫిరోజాబాద్‌లోనే 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫిరోజాబాద్‌తో పాటు ఆగ్రా, మధుర, మెయిన్‌పురి, ఎటావా, కస్గంజ్‌లో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఈ అంతుచిక్కని జ్వరానికి వివిధ కారణాలను చెబుతున్నారు వైద్య నిపుణులు. కొంతమంది రోగుల్లో జపనీస్ ఫీవర్ ఎన్సెఫాలిటిస్ వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొన్ని నివేదికలలో ఈ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్‌గా పేర్కొన్నారు. అయితే, ఈ స్క్రబ్ టైఫస్‌ అంశాన్ని ఐసిఎమ్‌ఆర్ పరిధిలోని అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ టి జాకబ్ జాన్ తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. వింత వ్యాధిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Also read:

Amazon: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు.. కీలక ప్రకటన చేసిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జాస్సీ..

Gold Price Today: ప్రసిడి ప్రియులకు బ్యాడ్‏న్యూస్.. స్థిరంగా గోల్డ్ రేట్స్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాల వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..