ఐ ఫోన్ గేమ్ ఆడిన 7 ఏళ్ళ గడుగ్గాయి..బిల్లు చెల్లించేందుకు కారును అమ్మేసుకున్న తండ్రి..ఎక్కడంటే ?
ఈ కాలపు పిల్లలు మరీ తెలివి మీరిపోతున్నారని పెద్దవాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నాం.. కానీ నిజమేనని అనిపిస్తోంది. బ్రిటన్..నార్త్ వేల్స్ లోని ఏడేళ్ల చిచ్చర పిడుగు విషయానికే వస్తే..
ఈ కాలపు పిల్లలు మరీ తెలివి మీరిపోతున్నారని పెద్దవాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నాం.. కానీ నిజమేనని అనిపిస్తోంది. బ్రిటన్..నార్త్ వేల్స్ లోని ఏడేళ్ల చిచ్చర పిడుగు విషయానికే వస్తే..అస్ హాజ్ అనే ఈ చిన్నారి ‘డ్రాగన్స్..రైజ్ ఆఫ్ బెర్క్’ అనే గేమ్ ని ఐ ఫోన్ లో ఆడుతూ కూర్చున్నాడు. మెల్లగా ఈ ఆట .. కొనుగోళ్ల వరకు సాగింది.. మెల్లగా 1.99 పౌండ్ల నుంచి 99.99 పౌండ్ల వరకు పలు యాప్ కొనుగోళ్లు చేసి పారేశాడు.. చివరకు ఈ కొనుగోళ్లు 1,289 పౌండ్లకు (మన కరెన్సీలో రూ. 1.33 లక్షలకు) చేరిపోయింది. తన కొడుకు చేస్తున్న ఈ యవ్వారాన్ని మహమ్మద్ ముంతాజ్ అనే ఆ తండ్రి గమనించి షాక్ తిన్నాడు. డాక్టర్ కూడా అయిన ఆయన… చిన్న పిల్లలు ఆడే ఆటకు అపరిమిత కొనుగోళ్లను ఈ గేమ్ వెర్షన్ ఎలా అనుమతిస్తోందని అన్నాడు.. ఈ సొమ్ము చెల్లించేందుకు చివరకు అయన తన కారునే అమ్మేశాడట.. ఈ గేమ్ వ్యవహారంపై కోర్టులో కేసు పెడతానని అయన అంటున్నాడు. ఫ్రీ గేమ్ అన్నది పిల్లలకు ఉండాలని, అంతే తప్ప.. ఇలా డబ్బుల గేమ్ ఉండరాదని ఆయన పేర్కొన్నాడు.
వీరిని అపరిమిత లావాదేవీలకు అనుమతించరాదన్నాడు. ఇంతకీ తన కొడుకు ఎలా ఈ గేమ్ ఆడాడో అర్థం కాలేదని…బహుశా తన పాస్ వర్డ్ ని ఎప్పడో చూసి ఉంటాడని అయన అన్నాడు. ఇంకా పబ్జీ వంటి ఆటలు ఆడుతూ అనేకమంది పిల్లలు బంగారం లాంటి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కొందరైతే సూసైడ్లకు కూడా పాల్పడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Three women missing : విశాఖలో కలకలం రేపుతోన్న ముగ్గురు మహిళల అదృశ్యం
రాహుల్ గాంధీతో నవ జ్యోత్ సింగ్ సిద్దు భేటీ… 48 గంటల్లో పంజాబ్ నేతకు కీలక పదవి ..?