వైష్ణో దేవి భక్తుల్ని వెంటాడిన మృత్యువు..! ఏడుగురు దుర్మరణం.. 20 మందికి గాయాలు.. ఏం జరిగిందంటే..

|

May 24, 2024 | 10:20 AM

వీరు ప్ర‌యాణిస్తున్న మినీ బ‌స్సు అంబాలా వ‌ద్ద ట్ర‌క్కును ఢీకొట్టింది. ట్ర‌క్కు ముందు ఓ కారు వేగంగా వెళ్తూ.. పెట్రోల్ బంక్ వ‌ద్ద ఆక‌స్మాత్తుగా మ‌లుపు తిప్పాడు. దీంతో దాని వెనుకాలే వేగంగా వెళ్తున్న ట్ర‌క్కు డ్రైవ‌ర్ ఆక‌స్మాత్తుగా బ్రేకులు వేశాడు. ట్ర‌క్కు వెనుకాలే వెళ్తున్న మినీ బస్సు డ్రైవ‌ర్ వేగాన్ని నియంత్రించ‌లేక ట్ర‌క్కును ఢీకొట్టిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపారు.

వైష్ణో దేవి భక్తుల్ని వెంటాడిన మృత్యువు..! ఏడుగురు దుర్మరణం.. 20 మందికి గాయాలు.. ఏం జరిగిందంటే..
Road Accident
Follow us on

ఒకే కుటుంబానికి చెందిన సుమారు 30 మంది జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి బస్సులో బయల్దేరారు. కానీ, ఊహించని ప్రమాదం వారిని వెంటాడింది. జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అంబాలా సమీపంలోని ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం మే 24న జరిగింది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా తెలిసింది. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబాలా కంటోన్మెంట్ సమీపంలోని మోహ్రా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్‌కు చెందిన 30 మంది వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించేందుకు మినీ బ‌స్సులో బ‌య‌ల్దేరారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలిసింది. వీరు ప్ర‌యాణిస్తున్న మినీ బ‌స్సు అంబాలా వ‌ద్ద ట్ర‌క్కును ఢీకొట్టింది. ట్ర‌క్కు ముందు ఓ కారు వేగంగా వెళ్తూ.. పెట్రోల్ బంక్ వ‌ద్ద ఆక‌స్మాత్తుగా మ‌లుపు తిప్పాడు. దీంతో దాని వెనుకాలే వేగంగా వెళ్తున్న ట్ర‌క్కు డ్రైవ‌ర్ ఆక‌స్మాత్తుగా బ్రేకులు వేశాడు. ట్ర‌క్కు వెనుకాలే వెళ్తున్న మినీ బస్సు డ్రైవ‌ర్ వేగాన్ని నియంత్రించ‌లేక ట్ర‌క్కును ఢీకొట్టిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపారు.

గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబానికి చెందిన 30 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…