Viral Video: వాహ్! ఏం టాలెంట్‌ గురూ.. డ్రైవింగ్‌ కళ మామూలుగా లేదుగా.. వీడియో చూసిన వాళ్లంతా షాకవ్వాల్సిందే..

ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మందికి పైగా ప్రజలు వీక్షించారు. చాలా మంది దీనిపై స్పందించారు. నెటిజన్లంతా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు - ఇది మీకు వింతగా అనిపించినప్పటికీ, గ్రామాల్లో ఇది సాధారణం అంటూ వ్యాఖ్యనించారు.

Viral Video: వాహ్! ఏం టాలెంట్‌ గురూ.. డ్రైవింగ్‌ కళ మామూలుగా లేదుగా.. వీడియో చూసిన వాళ్లంతా షాకవ్వాల్సిందే..
Tractor Driver
Follow us

|

Updated on: May 24, 2024 | 8:54 AM

మన దేశంలోని రోడ్లపై డ్రైవర్ల వింత వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అనేకం కనిపిస్తాయి. కొంతమంది డ్రైవర్లు ఎంతో బరువైన వెహికిల్స్‌ డ్రైవ్‌ చేస్తుంటారు. కొందరు డ్రైవర్లు విభిన్న ట్యాలెంట్‌ ప్రదర్శిస్తుంటారు. ఒకరు బైక్‌పై 9 మందిని, ఆటోలో 20 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంటారు. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంటర్‌నెట్‌లో మనం చూస్తుంటాం. ఇటీవల వైరల్‌ అయిన ఒక ఆటో డ్రైవర్ వార్తను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. అతను ఆటోలో 20 మంది ప్రయాణికులను ఎలా కూర్చోబెట్టాడో చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కూడా ఒక డ్రైవర్‌ భారీ లోడ్‌తో డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వైరల్‌ వీడియోలో ఒక డ్రైవర్‌ చెరకు లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను నడిపిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ ట్రాక్టర్‌ నిండా వంట చెరకు లోడ్‌ చేయబడి ఉంది. దాని బరువు మరీ ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్‌ ముందు భాగం గాల్లోకి లేచింది. ట్రాక్టర్‌లో దాని పరిమాణానికి మించి కట్టెల లోడ్‌ నింపడంతో ట్రాక్టర్‌ ఇంజిన్‌ పైకి లేచింది. ఇంజిన్‌తో పాటుగా ట్రాక్టర్‌ ముందు రెండు చక్రలు కూడా గాల్లోనే ఉన్నాయి. అయిన్నప్పటికీ ఆ డ్రైవర్‌ విన్యాసాలు చేస్తున్నాడు. అతడు తన తెలివితో ట్రాక్టర్ ముందు చక్రాన్ని ఎత్తి హెవీ వెహికిల్‌ని సంతోషంగా రోడ్డుపై పరిగెత్తిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ghantaa (@ghantaa)

ఈ వీడియోను ఘంటా అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మందికి పైగా ప్రజలు వీక్షించారు. చాలా మంది దీనిపై స్పందించారు. నెటిజన్లంతా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – ఇది మీకు వింతగా అనిపించినప్పటికీ, గ్రామాల్లో ఇది సాధారణం అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..