Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Business: పాల వ్యాపారం ద్వారా నెలకు రూ.11లక్షలు సంపాదిస్తున్న బామ్మ.. సాఫ్ట్‌వేర్‌ల కంటే అధిక ఆదాయం..

పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్‌ ఉద్యోగుల కంటే అధికంగా సంపాదిస్తోంది. ఏడాదికి ఏకంగా కోటీ 25 లక్షల లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..

Milk Business: పాల వ్యాపారం ద్వారా నెలకు రూ.11లక్షలు సంపాదిస్తున్న బామ్మ.. సాఫ్ట్‌వేర్‌ల కంటే అధిక ఆదాయం..
Navalben Milk Business
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2023 | 6:33 PM

పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్‌ ఉద్యోగుల కంటే అధికంగా సంపాదిస్తోంది. ఏడాదికి ఏకంగా కోటీ 25 లక్షల లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.. కేవలం పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఈ బామ్మ ఎలా సంపాదించగలుగుతున్నారో ఈ వివరాలు మీకోసం..

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, నబానా గ్రామంలో 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది నవల్‌బీన్‌ దల్సంభాయ్ చౌదరి (65). కాల క్రమేణా 15 గేదెలు కాస్తా 250కిపైగా విస్తరించాయి. రోజూ 11 వందల లీటర్ల పాలు సరఫరా చేస్తోంది. ఇలా ప్రతీ నెల 11 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటాయి. నవల్‌బీన్‌ ఏడాదికి కోటీ 25 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ఇక ఆమె నడుపుతున్న డైరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ.లక్షన్నరకు పైనే. మహిళా సాధికారతకు నవల్‌బీన్‌ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆరవై ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ విజయ వంతంగా పాల వ్యాపారం నడపడం చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.