Road Accident:ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌-ట్రక్కు ఢీకొని పలువురు భక్తులు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌కర్‌ విచారం వ్యక్తం చేశారు.

Road Accident:ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌-ట్రక్కు ఢీకొని పలువురు భక్తులు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం
Road Accident

Edited By:

Updated on: Aug 20, 2022 | 4:22 PM

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఆరుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. ఈ సంఘట రాజస్థాన్‌లోని పాలిలో శుక్రవారం రాత్రి జరిగింది. పాలి జిల్లా సుమేర్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పాలికి చెందిన యాత్రికులు ట్రాక్టర్‌లో జైసల్మేర్‌లోని రామ్ దేవ్రా‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ట్రాక్టర్, ట్రక్కు ఢీ కొన్నాయి. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌కర్‌ విచారం వ్యక్తం చేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి