పాములు బాబోయ్‌ పాములు.. ఏటా 50 వేల మందిని బలి తీసుకుంటున్నాయి : బీజేపీ ఎంపీ

|

Jul 29, 2024 | 5:45 PM

దేశంలో పెరిగిపోతున్న పాము కాటు మరణాల అంశాన్ని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్‌సభలో ప్రస్తవించారు. దేశంలో పాము కాటు కారణంగా ఏటా 50 వేల మంది చనిపోతున్నారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఆందోళన వ్యక్తం చేశారు.. ‘భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’ అని సభలో పాము కాటు మరణాలపై ఆయన ప్రస్తవించారు.

పాములు బాబోయ్‌ పాములు.. ఏటా 50 వేల మందిని బలి తీసుకుంటున్నాయి : బీజేపీ ఎంపీ
Snake Bite
Follow us on

పాము కాటు వల్ల భారతదేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని బిజెపి ఎంపి ఒకరు ప్రస్తవించారు. ప్రతి సంవత్సరం సుమారు 50,000 మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. దేశంలో పాముకాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, ప్రతి సంవత్సరం దాదాపు 30-40 లక్షల మంది పాము కాటు బారిన పడుతున్నారని అన్నారు. దేశంలో పాము కాటు మరణాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

దేశంలో పెరిగిపోతున్న పాము కాటు మరణాల అంశాన్ని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్‌సభలో ప్రస్తవించారు. దేశంలో పాము కాటు కారణంగా ఏటా 50 వేల మంది చనిపోతున్నారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఆందోళన వ్యక్తం చేశారు.. ‘భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’ అని సభలో పాము కాటు మరణాలపై ఆయన ప్రస్తవించారు.

లోక్‌సభలో చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ బీహార్‌ను కూడా ప్రస్తావించారు. బీహార్ అత్యంత పేద రాష్ట్రం అని అన్నారు. ప్రస్తుతం పేదరికం, విపత్తుల కారణంగా బీహార్‌ రెట్టింపు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటుందని రూడీ అన్నారు. వాతావరణ మార్పుల వల్ల కూడా బీహార్‌ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..