
తమిళనాడులోని ఓ శివాలయ ఉత్సవాల్లో అపశృతి దొర్లింది. కొలనులో దిగి శివపూజలు చేస్తోన్న ఐదుగురు అర్చకులు ప్రమాదవశాత్తూ కొలనులో మునిగి చనిపోయారు. ఈ ఘటన బాధిత కుటుంబాలను అంతులేని విషాదంలో ముంచింది. శివాలయ ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని కీలకట్టలై ప్రాంతానికి సమీపంలోని ధర్మలింగేశ్వర దేవాలయంలో పూజలు జరుగుతున్న సమయంలో..కొలనులోకి దిగిన ఐదుగురు అర్చకులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో శివాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులంతా 18 నుంచి 23 ఏళ్ళ వయస్సువారే. శివాలయ ఉత్త్సవాలలో భాగంగా పూజల కోసం కొలను లోకి దిగారు అర్చకులు. పూజల్లో భాగంగా నీటిలోకి దిగిన అర్చకుల్లో కొందరు ఆ పరమేశ్వరుడికి పూజలు చేస్తుండగానే ఒక్కసారిగా నీటిలోకి మునిగిపోయారు. అందరూ ఈ అనూహ్యపరిణామానికి నిశ్చేష్టులయ్యారు. మునిగిపోతున్న అర్చకులు హాహాకారాలు విని కూడా ఏమీచేయలేని స్థితిలో..అక్కడి వారు ప్రేక్షకులుగా ఉండిపోయారు.
అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోతోన్న అర్చకులను కొందరు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అప్పటికే కొలను లోలోపలికి కొట్టుకుపోయి మునిగిపోయారు ఐదుగురు అర్చకులు. ఈ విషాద ఘటనలో ఐదుగురు చనిపోగా మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. అర్చకుల భౌతిక కాయాల కోసం పోలీసులు కొలనులో గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..