AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Student Deaths: పై చదువులకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న భారతీయులు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

ఉన్నత చదువులు అనగానే కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వారికి ఎవరికైనా విదేశీ యూనివర్సిటీలే గుర్తుకొస్తాయి. విదేశాల్లో చదువుకోవడం స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు పై చదువుల కోసం వెళ్తున్నారు. వాతావరణం, భౌగోళిక స్థితిగతులు, భాష, ఆహారం.. ఇవేవీ సరిపడకపోయినా సరే, విదేశీ విద్యపై ఇష్టంతో అన్ని కష్టాలను భరిస్తూ ముందుకు సాగుతున్నారు.

Indian Student Deaths: పై చదువులకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న భారతీయులు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
Minister S Jaishankar
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Feb 02, 2024 | 4:54 PM

Share

ఉన్నత చదువులు అనగానే కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వారికి ఎవరికైనా విదేశీ యూనివర్సిటీలే గుర్తుకొస్తాయి. విదేశాల్లో చదువుకోవడం స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు పై చదువుల కోసం వెళ్తున్నారు. వాతావరణం, భౌగోళిక స్థితిగతులు, భాష, ఆహారం.. ఇవేవీ సరిపడకపోయినా సరే, విదేశీ విద్యపై ఇష్టంతో అన్ని కష్టాలను భరిస్తూ ముందుకు సాగుతున్నారు.

కొందరు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతుంటే.. కొందరు వెనక్కి తిరిగొచ్చి భారత్‌లో ఉన్నత స్థితిలో స్థిరపడుతున్నారు. అందరి కథలు ఇలా సుఖాంతమైతే ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. కానీ కొన్ని జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో తమ పిల్లలను విదేశాలకు పంపించిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. చదువుకుని పేరు తెస్తాడని పంపిస్తే, విగతజీవిగా తిరిగొస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టతరంగా మారుతోంది.

ఇవన్నీ ఒకెత్తయితే, వెళ్లిన దేశంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాలు, లేదా యుద్ధాలు, అంతర్గత సంక్షోభాలు అక్కడ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థుల పాటిన శాపాలుగా మారుతున్నాయి. వీటికి తోడు ఒత్తిడి, జాతి ద్వేషం, కాల్పులు, ప్రమాదాల వంటి ఘటనలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ దేశాల్లో వివిధ కారణాలతో ఇలా 403 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం (ఫిబ్రవరి 2) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ మంద్రి డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.

విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంక్షేమం తమ మొట్టమొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే భారత విద్యార్థులను సమీప భారత రాయబార కార్యాలయాలు (ఎంబసీలు, కాన్సులేట్ల)లో రిజిస్టర్ చేసుకోవాలని విద్యార్థులందరినీ సూచిస్తున్నట్టు చెప్పారు. తద్వారా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం తరచుగా సంప్రదిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటుందని చెప్పారు. అలాగే అక్కడి యూనివర్సిటీల యాజమాన్యం, అక్కడి భారతీయ సమూహాలను ఏంబసీ ఉన్నతాధికారులు తరచుగా కలుస్తున్నారని, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారని వివరించారు.

అలాగే స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి అవసరమైన సహాయ సహకారాలు కూడా అందజేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే విద్యార్థుల తమ సమస్యలు చెప్పుకునేందుకు ఒక కాల్ సెంటర్‌తో పాటు MADAD పేరుతో ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. విద్యార్థులు ఫోన్ కాల్, ఈ-మెయిల్, సోషల్ మీడియా లేదా నేరుగా వాక్-ఇన్ విధానాల్లో సంప్రదించి తమ సమస్యల గురించి ప్రస్తావించవచ్చని తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక యూనివర్సిటీ యాజమాన్యాలు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.

దీంతోపాటు విద్యార్థులు చదువుకుంటున్న దేశాల్లో సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు సంభవించినప్పుడు వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎయిర్‌లిఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆపరేషన్ గంగ, ఆపరేషన్ అజయ్ వంటి ఈ మధ్యకాలంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. గత మూడేళ్లలో మొత్తం 23,906 మంది భారతీయ విద్యార్థులను సంక్షోభంలో ఉన్న విదేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చామని చెప్పారు. వివిధ కారణాలతో విదేశాల్లో మృతి చెందిన విద్యార్థుల గణాంకాలను కూడా ఆయన ప్రస్తావించారు.

2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకుంటున్న 403 మంది భారత విద్యార్థులు మృతి చెందారు. అత్యధిక మరణాలు కెనడా లో 91మంది మృత్యువాత పడ్డారు. ఇక, యూకేలో 48 మంది, రష్యాలో 40మంది, అమెరికాలో 36మంది, ఆస్ట్రేలియాలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో శ్రేయాస్ రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. ఈ ఘటనపై న్యూయార్క్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో పాటు విద్యార్థి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతోంది. మృతి ఘటనపై పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…