Corona Vaccination: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 39 మంది స్కూల్ పిల్లలకు ఒకే సిరంజితో వ్యాక్సినేషన్

|

Jul 28, 2022 | 7:48 PM

15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 39 మంది పిల్లలు 9 నుండి 12 తరగతుల్లో చదువుతున్నారని ఆరోగ్య అధికారి తెలిపారు. తల్లిదండ్రులు

Corona Vaccination: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 39 మంది స్కూల్ పిల్లలకు ఒకే సిరంజితో వ్యాక్సినేషన్
Covid Vaccination
Follow us on

Corona Vaccination: అసలే ఇది వైరస్‌లా కాలం..రోజుకో కొత్త రకం వైరస్‌ మనుషుల్ని పట్టిపీడిస్తోంది. ఇలాంటి టైమ్‌లో సోషల్ డిస్టెన్స్‌ పాటించటం తప్పనిసరి అయిపోయింది. ఇలాంటి టైమ్‌లో కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏకంగా 39మంది స్కూల్‌పిల్లల ప్రాణాలను రిస్క్‌లో పడేలా చేసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో 39 మంది పిల్లలకు యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయడానికి వ్యాక్సినేటర్ ఒకే సిరంజిని ఉపయోగించటం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది ఈ ఘోరం. ఒకే సిరంజితో ఏకంగా 39 మంది స్కూల్ పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చారు.పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 39 మంది పిల్లలకు యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయడానికి వ్యాక్సినేటర్ ఒకే సిరంజిని ఉపయోగించినట్లు తేలింది. బుధవారం నాడు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు వేయడానికి ఒకే సిరంజిని ఉపయోగించడాన్ని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జైన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని, వ్యాక్సినేటర్‌ జితేంద్ర అహిర్వార్‌గా గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు జిల్లా అధికారి తెలిపారు.

15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 39 మంది పిల్లలు 9 నుండి 12 తరగతుల్లో చదువుతున్నారని ఆరోగ్య అధికారి తెలిపారు. తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో సాగర్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ సమస్యను పరిశీలించడానికి జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డీకే గోస్వామిని పంపారు. 39 మంది పిల్లలకు టీకాలు వేయడానికి వ్యాక్సినేటర్ ఒకే సిరంజిని ఉపయోగించినట్లు సంఘటన స్థలంలో ఉన్న వారు గోస్వామికి తెలిపారు. తల్లిదండ్రుల నిరసనలతో అహిర్వార్ సంఘటనా స్థలం నుండి తప్పించుకున్నాడు. సీఎంహెచ్వో పాఠశాలను తనిఖీ చేసినప్పుడు అహిర్వార్ కనిపించలేదు. నిందితుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని గోస్వామి తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సిఎంహెచ్‌ఓ నివేదిక ఆధారంగా జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ రాకేష్ రోషన్‌పై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డివిజనల్ కమిషనర్‌కు కలెక్టర్ సిఫార్సు చేశారని సింఘాల్ తెలిపారు. ఆరోగ్య అధికారులు మొత్తం 39 మంది పిల్లలను పరీక్షించారు. వారిలో 19 మంది రిపోర్టులు సాధారణంగా ఉన్నట్టు తేలాయి. మిగిలిన పిల్లల రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని గోస్వామి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి