ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో రాకెట్ గ్రెనేడ్ల కలకలం.. ఒకేచోట మూడు స్వాధీనం .. అధికారుల అప్రమత్తం

ఆలయ ప్రాంతానికి సమీపంలోని పాడుబడిన ఆర్మీ శిక్షణా కేంద్రంలో మూడు రాకెట్‌తో నడిచే గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.

ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో రాకెట్ గ్రెనేడ్ల కలకలం.. ఒకేచోట మూడు స్వాధీనం .. అధికారుల అప్రమత్తం
Rocket Grenades

Updated on: Oct 29, 2022 | 9:50 PM

ఆర్మీ శిక్షణా కేంద్రంలో మూడు రాకెట్‌తో నడిచే గ్రెనేడ్లు కలకలం రేపాయి.. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని సింగపెరుమాళ్ ఆలయ ప్రాంతానికి సమీపంలోని పాడుబడిన ఆర్మీ శిక్షణా కేంద్రంలో మూడు రాకెట్‌తో నడిచే గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని కురుబర సంఘం ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెంగల్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్ సహాయంతో బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

సింగపెరుమాళ్ ఆలయానికి సమీపంలో ఉన్న ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో దొరికిన గ్రెనేడ్ పరిస్థితిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనిపై తదుపరి విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి