Watch: సిమెంట్ ప్లాంట్‌లో స్లాబ్ కూలి ముగ్గురు కూలీలు మృతి.. శిథిలాల కింద మరెంతో మంది..!

|

Jan 30, 2025 | 6:44 PM

సిమెంట్ ప్లాంట్‌లో గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న భాగంలో రూఫ్ స్లాబ్‌లు వేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ కూలిపోయింది. దాని కింద చిక్కుకుని ఇద్దరు కూలీలు మృతి చెందగా.. 50 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని సమాధి అయినట్లు సమాచారం.

Watch: సిమెంట్ ప్లాంట్‌లో స్లాబ్ కూలి ముగ్గురు కూలీలు మృతి.. శిథిలాల కింద మరెంతో మంది..!
slab collapse at cement plant
Follow us on

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. ఓ సిమెంటు ఫ్యాక్టరీలో స్లాబ్‌ కూలి ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. పన్నా జిల్లాలోని సిమారియాలో ఉన్న JK సిమెంట్ ప్లాంట్‌లో గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న భాగంలో రూఫ్ స్లాబ్‌లు వేస్తున్నారు.

ప్రమాద సమయంలో ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ కూలిపోయింది. దాని కింద చిక్కుకుని ఇద్దరు కూలీలు మృతి చెందగా.. 50 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.

శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని సమాధి అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రత దృష్ట్యా, ఫ్యాక్టరీ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. కార్మికులను తరలించడానికి పోలీసులు, పరిపాలన బృందాలు కష్టపడాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?

ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్

ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..