భారత్‌లో మరోసారి భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరిలో మే8 బుధవారం తెల్లవారుజామున 4:55 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ప్రజలంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించటంతో అందరూ ఉలిక్కిపడి మేల్కొన్నారు. అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు.
An earthquake of magnitude 3.1 on the Richter Scale hit Lower Subansiri, Arunachal Pradesh at 4:55 am today: National Center for Seismology pic.twitter.com/eGJs1WTzug
ఇవి కూడా చదవండి— ANI (@ANI) May 8, 2024
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. అయితే భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం, భూకంప కేంద్రం, దాని లోతు గురించి సమాచారం అందలేదు. గత కొన్ని నెలలుగా, కాశ్మీర్ నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు భూకంప ప్రకంపనలు సంభవించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..