Oxygen Supply: గోవాలో దారుణం.. ఆక్సిజన్ అందక 26 మంది కరోనా రోగుల మృత్యువాత..

|

May 12, 2021 | 6:56 AM

Covid-19 patients dead: గోవాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలో 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ సరఫరాలో

Oxygen Supply: గోవాలో దారుణం.. ఆక్సిజన్ అందక 26 మంది కరోనా రోగుల మృత్యువాత..
26 Patients Die At Goa Hospital,
Follow us on

Covid-19 patients dead: గోవాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలో 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలగడంతోనే వారంతా మరణించారని పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె గోవా హైకోర్టును కోరారు. గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్య 26 మంది కరోనా బాధితులు మరణించిన సంగతి వాస్తవమని రాణె తెలిపారు. మరణాలకు కారణం మాత్రం స్పష్టంగా తెలియదని వెల్లడించారు. ఆసుపత్రికి ప్రాణవాయువు సరఫరాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయ్న సంగతి నిజమేనని మంత్రి రాణే అంగీకరించారు.

కాగా.. కరోనా రోగుల మృతి వార్త తెలియగానే జీఎంసీహెచ్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సందర్శించారు. కరోనా వార్డులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో చోటుచేసుకున్న జాప్యమే తాజా మరణాలకు కారణం కావొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాణవాయువు, కొరత లేదని స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే గోవాలోకి అనుమతి..
కాగా గోవాలో కరోనా కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. ఇప్పటివరకు గోవాలో 1.22 లక్షల కేసులు నమోదు కాగా.. మరణించిన వారి సంఖ్య 1700లకు పైగా చేరుకుంది. కరోనా నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారినే ఇకపై గోవాలోకి అనుమతించాలని ధర్మాసనం ఈ మేరకు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? తక్కువ వడ్డీతో కారు లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. చివరి తేదీ జూన్‌ 4.. దరఖాస్తు చేయండిలా..!