వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న తల్లిదండ్రులు.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి.. చివరికి

|

Jun 03, 2023 | 6:03 PM

బోరు బావుల్లో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగడం లేదు. నీళ్లు పడని, నీళ్లు అడుగంటి నిరుపయోగకంగా మారిన బోర్లను పూడ్చివేయకుండా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అలాగే వేస్తున్నారు. దీంతో ఎక్కడో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న తల్లిదండ్రులు.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి.. చివరికి
Borewell
Follow us on

బోరు బావుల్లో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగడం లేదు. నీళ్లు పడని, నీళ్లు అడుగంటి నిరుపయోగకంగా మారిన బోర్లను పూడ్చివేయకుండా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అలాగే వేస్తున్నారు. దీంతో ఎక్కడో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడుకుంటు వెళ్లిన చిన్నారులు ఆ బోరుబావిలో పడి నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా గుజరాత్‌లో జామ్‌నగర్ ఏరియాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జామ్‌నగర్ ప్రాంతంలోని శనివారం ఉదయం తల్లిదండ్రులు తమ చిన్నారిని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు.

ఆ తల్లిదండ్రులు తమ పనులు చేస్తుండగా ఆ చిన్నారి ఆడుకుంటోంది. అలా ఆడుకుంటుండగానే దగ్గర్లో ఉన్న బోరుబావిలో పడిపోయింది. సమాచారం మేరకు స్థానికులు, పోలీసులు హుటాహుటీనా చేరుకున్నారు. బాలికను కాపాడేందు సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి ఈ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఆ చిన్నారి బోరుబావిలో 20 లోతులో ఇరుక్కుందని అధికారులు తెలిపారు. మొత్తం ఆ బోరుబావి 200 అడుగుల లోతు వరకు ఉంటుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి