Watch Video: బైక్ పై వెళ్తున్న ఇద్దరిపై ఐదు వీధి కుక్కలు దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఇటీవల హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో జీఎహెచ్ ఎంసీ అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇటీవల హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో జీఎహెచ్ ఎంసీ అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు సంతానోత్పతి నియంత్రణ చికిత్సలు చేసి మళ్లీ విడిచిపెట్టారు. అలాగే వివిధ జిల్లాల్లో కూడా కుక్కల బెడద పెరిగిపోవడం మీడియాలో కూడా బాగా ప్రచారం వచ్చింది. కుక్కలు వెంటబడే కొన్ని సీసీటీవీ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే పంజాబ్ లో చోటుసుకుంది. ఒక్కటి కాదు, రెండు కాదు..దాదాపు ఐదు వీధి కుక్కలు బైక్ పై వెళ్తున్న ఇద్దరిపై దాడి చేశాయి.
వివరాల్లోకి వెళ్తే పంజాబ్ లోని జలంధర్ ప్రాంతంలో రాత్రిపూట ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. ఓ విధిలోకి రాగానే అక్కడున్న కుక్కలను చూసి ఆగిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆ ఐదు కుక్కలు బైక్ పై ఉన్నవారిపై దాడికి దిగాయి. వెనకాల కూర్చున వ్యక్తి జాకెట్ ను కిందకి లాగేశాయి. ఆ తర్వాత ముందు కూర్చున్న వ్యక్తి బైక్ దిగి..ఓ రాయిని పట్టుకొని బెదిరించడంతో ఆ కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇదిలా ఉండగా ప్రతినెల జలంధర్ ప్రాంతంలో 300 లకు పైగా కుక్కల దాడులు జరగుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. గత ఆరు నెలల్లో రోజువారి కుక్క దాడుల కేసులు గణనీయంగా పెరిగాయాని వెల్లడించింది.




Stray dogs attacked on two people going on scooty in #Jalandhar.#dogattack #straydogs #Dog #Punjab #PunjabiNews pic.twitter.com/v72e7kPWfu
— Siraj Noorani (@sirajnoorani) April 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం