ఫేమస్ యూట్యూబర్ ప్రియోలినా ఆత్మహత్య.. భర్త ప్రమేయంపై ఆరా.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

అసోం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల ప్రముఖ యూట్యూబర్ ప్రియోలినా నాథ్ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి గౌహతిలోని బామునిమైదామ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది..

ఫేమస్ యూట్యూబర్ ప్రియోలినా ఆత్మహత్య.. భర్త ప్రమేయంపై ఆరా.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
Priolinanath
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 15, 2023 | 8:48 AM

అసోం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల ప్రముఖ యూట్యూబర్ ప్రియోలినా నాథ్ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి గౌహతిలోని బామునిమైదామ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సంగీ వ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న ప్రియోలినా నాథ్ శరీరంపై పలు గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె భర్త.. పంకజ్ నాథ్ ను చంద్‌మారి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు. మూడు నెలల క్రితమే ప్రియోలినాకు పంకజ్‌తో వివాహమైంది. ప్రియోలినా బొంగైగావ్‌ ప్రాంతంలో నివాసం ఉండేది. ఆమెకు సోనిత్‌పూర్ జిల్లా జముగురిహాట్ ప్రాంతానికి చెందిన పంకజ్ నాథ్ తో వివాహమైంది.

ప్రియోలినా సూసైడ్ వార్త తెలుసుకున్న వెంటనే.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి తరఫు బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసుకుని, విచారణ స్టార్ట్ చేశారు. ఉరివేసుకున్న ఆమె శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

విచారణ చేస్తున్న సమయంలో.. ప్రియోలినా సూసైడ్ చేసుకుందని ఆమె భర్త చెప్పినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాము ఆ విషయాన్ని నమ్మలేదని, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. యూట్యూబర్ మృతి వార్త తమనెంతో కలిచివేసిందని ఆమె బంధువులు, స్నేహితులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..