అయ్యో ఏంటి ఈ దారుణాలు.. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఆత్మహత్య కేసులు

|

Aug 03, 2023 | 3:05 PM

ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలో ఫెయిలయ్యామని.. చదవడం మా వల్ల కాదనే ఆలచోనలతో మరణమే శరణ్యమనుకుంటా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే రాజస్థాన్‌లోని కోటా అనే పట్టణంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి.

అయ్యో ఏంటి ఈ దారుణాలు.. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఆత్మహత్య కేసులు
Death
Follow us on

ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలో ఫెయిలయ్యామని.. చదవడం మా వల్ల కాదనే ఆలచోనలతో మరణమే శరణ్యమనుకుంటా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే రాజస్థాన్‌లోని కోటా అనే పట్టణంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. అక్కడ రెండు, మూడు వారాలకొకసారి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా మెడికల్ ప్రవేశ పరీక్షను ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడ్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మన్‌జ్యోత్‌గా గుర్తించారు. ఈ సంవత్సరంలో అక్కడ ఇప్పటివరకు 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్‌జ్యోత్ ఛబ్రా అనే యువకుడు.. నీట్ శిక్షణ కోసం ఈ ఏడాది జనవరిలో కోటాకు వచ్చాడు. నీట్ కోచింగ్ తీసుకున్న అతడు. గురువారం తన హస్టల్ గదిలో విగత జీవిగా కనిపించాడు. అతడ్ని చూసిన తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాకయ్యారు. మన్‌జ్యోత్‌ను ఆసపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వివిధ ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు కోటా ప్రసిద్ధి చెందింది. అక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వచ్చి కోచింగ్‌లు తీసుకుంటారు. ఈ ఏడాది అక్కడ దాదాపు 2.5 లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన రేపుతోంది. గత ఏడాది 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ ఏడాదికి ఆ సంఖ్య 17 కు చేరింది. మరో విషయం ఏంటంటే అంతకు ముందు కూడా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.