ఈ మధ్య రాజకీయ నేతలపై సీబీఐ ఈడీ దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఈ దాడులు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని.. కావాలనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు చేయిస్తోందని ఇదివరకే విపక్ష నాయకులు ఆరోపించారు. అయితే తాజాగా ఈ విషంపై 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐడీ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్ వేసిన వాటిలో కాంగ్రెస్, DMK, RJD, BRS, TMC, AAP, NCP, శివ సేన ఉద్దవ్,JMM, JDU, CPI, CPM, SP పార్టీలు ఉన్నాయి.
అయితే పిటీషన్ లో అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత దర్యాప్తు సంస్థలు పాటిస్తున్న మార్గదర్శకాలేంటో తెలపాలని సుప్రీం కోర్టును కోరాయి. దీనిపై వేగంగా విచారణ చేసేందుకు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్వీ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఈ విషయాన్ని వివరించారు.సీబీఐ, ఈడీ సంస్థలను పూర్తిగా ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిషేక్ సింగ్వీ తెలిపారు. అలాగే దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన వారిలో దాదాపు 95 శాతం మంది విపక్ష పార్టీల నేతలే ఉన్నారని పేర్కొన్నారు. అయితే దీనిపై చీఫ్ జస్టీస్ విచారించేందుకు అంగీకరించాడు. ఏప్రిల్ 5న దీనిపై విచారణ చేస్తామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..