MLA Shankar Naik: రైతు కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఆశ్చర్యానికి గురైన స్థానికులు.. ఎందుకో తెలుసా..?
మహబూబాబాద్ మండలం అమనగల్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ రైతుకు పాదాభివందనం చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతు వద్ది సుదర్శన్‌రెడ్డికి...

MLA Shankar Naik: మహబూబాబాద్ మండలం అమనగల్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ రైతుకు పాదాభివందనం చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతు వద్ది సుదర్శన్‌రెడ్డికి మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఇలా కృతజ్ఞతలు తెలిపారు.
అమనగల్ గ్రామంలో పీహెచ్‌సీ ఉపకేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రూ. 30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు రైతు వద్ది సుదర్శన్‌రెడ్డి. దీంతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ స్వయంగా గ్రామానికి చేరుకుని ఆ స్థలంలో పీహెచ్‌సీ సబ్‌సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని రైతు వద్ది సుదర్శన్‌రెడ్డి స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. స్థలదాత వద్ది సుదర్శన్‌రెడ్డికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాదాభివందనం చేశారు. రైతు కుటుంబం చల్లాగా వుండాలని భగవంతుడిని వేడుకున్నారు. అనంతరం అమనగల్, జంగిలిగొండ గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు.
Also Read:
Porto captain Pepe Fight: గ్రౌండ్‌లో కొట్టుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన వీడియో..