Telugu News Lifestyle Your Brain Can Stay 25 Forever – Here Are the Proven Secrets Scientists Swear By
Brain Health: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిన్న చిన్న పనులు చేయాల్సిందే
కంప్యూటర్‌కి హార్డ్ డిస్క్ ఎలాగో మన శరీరానికి మెదడు అలాగే. కానీ హార్డ్ డిస్క్ కేవలం డేటా సేవ్ చేస్తుంది, మన మెదడు మాత్రం జీవితాంతం 86 బిలియన్ న్యూరాన్లతో నానో సెకన్లలో లక్షల కోట్ల కనెక్షన్లు ఏర్పరుస్తూ… మన ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు, జ్ఞాపకాలు ..
కంప్యూటర్‌కి హార్డ్ డిస్క్ ఎలాగో మన శరీరానికి మెదడు అలాగే. కానీ హార్డ్ డిస్క్ కేవలం డేటా సేవ్ చేస్తుంది, మన మెదడు మాత్రం జీవితాంతం 86 బిలియన్ న్యూరాన్లతో నానో సెకన్లలో లక్షల కోట్ల కనెక్షన్లు ఏర్పరుస్తూ… మన ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు, జ్ఞాపకాలు, కలలు అన్నింటినీ నిర్వహిస్తుంది. ఈ అద్భుత యంత్రం ఎప్పుడూ యంగ్ & షార్ప్ గా ఉండాలంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నిపుణులు చెబుతున్న సూచనలేంటో తెలుసుకుందాం..
Brain Health
ఎవరైనా ఉన్నట్టుండి 2×17 ఎంతో చెప్పమంటే కంగారు పడుతున్నారా? అయితే మీ మెదడు పనితీరు మందగిస్తుందని సంకేతం. రోజూ 10 నిమిషాలు సుడోకు, క్రాస్‌వర్డ్, చదరంగం, మ్యాథ్ పజిల్స్, బ్రెయిన్ టీజర్స్… ఇలా ఏదో ఒకటి ఆడటం వల్ల కొత్త న్యూరల్ పాత్‌వేస్ ఏర్పరుస్తాయి, మెమొరీ షార్ప్ అవుతుంది, ఏజింగ్ ఆలస్యమవుతుంది.
పెయింటింగ్, గిటార్, నవల చదవడం, గార్డెనింగ్… ఇలా మీకు ఇష్టమైన పని రోజూ 20–30 నిమిషాలు చేస్తే స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుంది, డోపమైన్-సెరోటోనిన్ పెరుగుతాయి. మెదడు ప్రశాంతంగా, చురుగ్గా పనిచేస్తుంది.
రోజూ 30 నిమిషాల బ్రిస్క్ వాక్, యోగా లేదా జిమ్ చేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సప్లై పెరుగుతుంది. BDNF (Brain-Derived Neurotrophic Factor) అనే ప్రోటీన్ స్థాయి పెరిగి కొత్త న్యూరాన్లు పుడతాయి. అందుకే వ్యాయామం చేసే వాళ్లకు అల్జీమర్స్ రిస్క్ 50% తక్కువ!
రోజువారీ క్యాలరీల్లో 10–20% తగ్గించి తింటే మెదడులో ఆటోఫేజీ ప్రక్రియ వేగవంతమవుతుంది. పాత, డ్యామేజ్ అయిన సెల్స్ క్లీన్ అవుతాయి, కొత్త సెల్స్ ఎక్కువగా పుడతాయి.
ఒక్క సిగరెట్ కూడా మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతుంది, న్యూరాన్లను చంపేస్తుంది. మద్యం హిప్పోక్యాంపస్ (మెమొరీ సెంటర్)ను దెబ్బతీస్తుంది. రెండూ పూర్తిగా మానేయండి, మెదడు 6 నెలల్లోనే రికవర్ అవుతుంది.
నిద్రలోనే మెదడు టాక్సిన్స్ ఫ్లష్ చేస్తుంది, జ్ఞాపకాలను కన్సాలిడేట్ చేస్తుంది. తక్కువ నిద్రపోతే అమిలాయిడ్ ప్లాక్స్ పేరుకుపోయి అల్జీమర్స్ రిస్క్ పెరుగుతుంది.
రోజూ 10 నిమిషాల మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ వల్ల కార్టిసాల్ తగ్గుతుంది. హై బీపీ, డయాబెటిస్ ఉంటే మెదడుకు బ్లడ్ ఫ్లో తగ్గి స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది.
ఈ అలవాట్లు రోజువారీ జీవితంలో చేర్చుకుంటే, మీ మెదడు 30లోనూ, 50లోనూ, 70లోనూ 25 ఏళ్ల యువకుడిలా చురుగ్గా, క్రియేటివ్‌గా పనిచేస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈరోజే మొదలు పెట్టేయండి!