AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Ramdev: బాబా రామ్ చెప్పిన ఈ ఆహారాన్ని, యోగాని ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం..

ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. ఎందుకంటే మనం తినే ఆహారం నుంచి రోజువారీ దినచర్య వరకు అనేక చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాము. పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి కొన్ని సులభమైన మార్గాలను పంచుకున్నారు. వీటిని స్వీకరించడం వలన జుట్టు రాలడం అనే సమస్య నుంచి బయట పడవచ్చు.

Baba Ramdev: బాబా రామ్ చెప్పిన ఈ ఆహారాన్ని, యోగాని ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం..
Yog Guru Baba Ramdev
Surya Kala
|

Updated on: Oct 07, 2025 | 11:03 AM

Share

యోగా గురువు బాబా రాందేవ్ తన పతంజలి ఉత్పత్తి ద్వారా ప్రతి ఇంటికి ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకురావడమే కాదు.. యూట్యూబ్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆరోగ్యం, ఫిట్‌నెస్, చర్మం , జుట్టు సంబంధిత సమస్యలను ఎలా అధిగమించాలో కూడా ప్రజలకు బోధిస్తున్నారు. నేడు చాలా మంది మహిళలు, పురుషులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యగా జుట్టు రాలడం. బాబా రామ్ దేవ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. జుట్టు రాలడం వెనుక శరీర వేడి, ఐరెన్ లోపం సహా ఇతర సూక్ష్మపోషకాల లేకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి కొన్ని సాధారణ యోగా అభ్యాసాలను సూచించారు. అంతేకాదు జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రభావవంతంగా ఉండే కొన్ని ఆహారాలను కూడా వివరించారు. వాటిని తినే ఆహారంలో చేర్చుకోమని సూచించారు.

బాబా రామ్ దేవ్ జుట్టు రాలడాన్ని నివారించడంలో అనేక సహజ పద్ధతులు చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెప్పారు. బాబా రామ్ దేవ్ ప్రకృతి వైద్యం, యోగాకలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కనుక వివిధ రకాల మందులు తీసుకోవడం కంటే సహజ పద్ధతులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి బాబా రామ్ దేవ్ సూచించే పద్ధతులను గురించి తెలుసుకుందాం..

ఈ జ్యూస్ ని మీ డైట్ లో చేర్చుకోండి. బాబా రామ్ దేవ్ తినే ఆహారంలో సొరకాయను చేర్చుకోవడం వల్ల జుట్టుకు చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు , కొద్దిగా నిమ్మ రసాన్ని జోడించడం ద్వారా సొరకాయ రసం తయారు చేసుకోవచ్చు (మీకు ఆమ్లత్వం ఉంటే నిమ్మకాయను జోడించవద్దు). ఈ రసం తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉసిరిని తినండి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఉసిరి చర్మం, జుట్టు రెండింటికీ మేలు చేస్తుంది. దీనిని ఏ రూపంలోనైనా తినవచ్చని బాబా రామ్‌దేవ్ చెప్పారు. ఉసిరి క్యాండీ, జామ్, జ్యూస్ లేదా పౌడర్ రూపంలో తీసుకున్నా ఉసిరి జుట్టు రాలడాన్ని నివారించడంలో .. జుట్టు బలంగా ఎదగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ ప్రాణాయామం చేయడం వల్ల ప్రయోజనం   యోగా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని బాబా రామ్‌దేవ్ అంటున్నారు. ముఖ్యంగా అనులోమ-విలోమ ప్రాణాయామం మీ జుట్టుకు, మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీర అంతర్గత విధులలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి బాబా రామ్‌దేవ్ ప్రకారం ఈ సహజ నివారణలను పాటించడమే కాదు.. సమతుల్య జీవనశైలిని అనుసరించడం ద్వారా.. జుట్టు రాలడం సమస్యను మెరుగైన రీతిలో నిర్వహించవచ్చు. ఈ విధంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

పాత కాలం నాటి సహజ నివారణ గతంలో జుట్టు రాలడం తక్కువగా ఉండేది ఎందుకంటే జుట్టు సంరక్షణ కోసం ప్రజలు బ్యూటీ ప్రొడక్ట్స్ కు బదులుగా సహజమైన రసాయనాలు లేని పదార్థాలను ఉపయోగించేవారి. షాంపూకి బదులుగా.. కుంకుడు, షికాయి, ఉసిరి, మందారం వంటి వాటి మిశ్రమంతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇవి జుట్టును నల్లగా, మందంగా, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)