- Telugu News Photo Gallery No worries if you are on a red Amaranth diet, all those problems will go away
ఎర్ర తోటకూర డైట్లో ఉంటే నో వర్రీ.. ఆ సమస్యలన్నీ హాంఫట్..
చాలా మంది రెగ్యులర్‌గా ఆకు కూరలు తింటూ ఉంటారు. ఆకు కూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకు కూరల్లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. ఆకు కూరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో ఎర్ర తోట కూర కూడా ఒకటి. చాలా మందికి ఎర్ర తోట కూర గురించి తెలీదు. ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎర్ర తోట కూర తినడం. ఎర్ర తోట కూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి నుంచి మంచి రిలీఫ్..
Updated on: Oct 07, 2025 | 3:45 PM

చాలా మంది రెగ్యులర్‌గా ఆకు కూరలు తింటూ ఉంటారు. ఆకు కూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకు కూరల్లో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. ఆకు కూరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో ఎర్ర తోట కూర కూడా ఒకటి.

చాలా మందికి ఎర్ర తోట కూర గురించి తెలీదు. ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎర్ర తోట కూర తినడం. ఎర్ర తోట కూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి నుంచి మంచి రిలీఫ్ లభ్యమవుతుంది.

ఎర్ర తోటకూరలో పొటాషియం కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది రక్త పోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

డయాబెటీస్ ఉన్నవారు ఈ ఎర్ర తోట కూర తింటే రక్తంలో.. షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కంటి సమస్యలను తగ్గించి.. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.

అదే విధంగా ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.




