Kargil War: ఝాన్సీరాణి వారసత్వం అంటే ఇదేగా.. గర్భంతో ఉండి రెండేళ్ల కొడుకుతో కార్గిల్ యుద్ధంలో

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆపరేషన్ సిందూర్ వార్తలే.. ఏ నోట విన్నా సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌ల గురించే .. అయితే అవసరం అయితే ఆడది యుద్ధం బెబ్బులిలా పోరాడుతుందని కార్గిల్ యుద్ధంలో కూడా ఓ మహిళా ఆర్మీ ఆఫీసర్ నిరూపించారు. ఇప్పుడు 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో దైర్య సాహసాలతో పోరాడిన మహిళా ఆర్మీ ఆఫీసర్ గురించిన ఒక కథ వైరల్ అవుతోంది. ఆ సమయంలో ఆ ఫీసర్ గర్భవతి.. రెండేళ్ల బిడ్డకు తల్లి. అయినా దేని గురించి చింతించకుండా.. దేశ రక్షణ కోసం సైన్యంతో దైర్యంగా పోరాడింది. ఆమె స్ఫూర్తిదాయకమైన కథ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ఆ మహిళా ఆఫీసర్ గురించి తెలుసుకుందాం..

Kargil War: ఝాన్సీరాణి వారసత్వం అంటే ఇదేగా.. గర్భంతో ఉండి రెండేళ్ల కొడుకుతో కార్గిల్ యుద్ధంలో
Yashika Hatwal Tyagi

Updated on: May 16, 2025 | 11:43 AM

ఆపరేషన్ సిందూర్ తర్వాత.. దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వాప్తంగా కూడా భారత సైన్యం బలం, పరాక్రమం గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే, ఈ ఆపరేషన్ తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి , వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది భారతీయులు మహిళలు ఇచ్చే ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది అంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు ప్రతి ఒక్కరూ వారిని ప్రేరణగా తీసుకొని, మహిళలు ఇలాగే ఉండాలని చెబుతున్నారు కూడా. ఇదిలా ఉండగా 999లో కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఒక ధైర్యవంతురాలైన మహిళా సైనికాధికారి కథ వైరల్ మళ్ళీ తెరపైకి వచ్చింది. మహిళా ఆర్మీ ఆఫీసర్ యాషికా హత్వాల్ త్యాగి. యుద్ధ సమయంలో యాషికా గర్భవతి.. రెండేళ్ల బిడ్డకు తల్లి. అయినప్పటికీ కార్గిల్ యుద్ధంలో శత్రు సైన్యంతో ధైర్యంగా పోరాడారు. తను ఒక తల్లిని, గర్భవతిని అనేది పట్టించుకోలేదు . దేశ రక్షణ తన ప్రాధాన్యత అనుకున్నారు.

గర్భవతిగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆఫీసర్

ఇవి కూడా చదవండి

1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం గురించి .. ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాడి దేశానికి విజయం తెచ్చిన సైనికుల గురించి తలచుకుని నేటికీ గర్వ పడతారు. అయితే ఈ యుద్ధంలో పోరాడిన ఆర్మీ ఆఫీసర్స్ లో యాషికా హత్వాల్ త్యాగి అనే మహిళా సైనికాధికారి ఒకరు. ఇటీవల రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో.. యాషికా హత్వాల్ త్యాగి గర్భవతిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధంలో చేసిన కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడారు. పాడ్‌కాస్ట్‌లో, యాషికా త్యాగి కార్గిల్ లో యుద్ధం చేయడనికి వెళ్తున్న సమయంలో తాను రెండు నెలల గర్భవతిని అని.. అప్పటికే రెండేళ్ళ చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ వీడియో vcast_7773 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.

వీడియోను ఇక్కడ చూడండి:

కార్గిల్ యుద్ధ సమయంలో యాశికా లేహ్ నుంచి సియాచిన్ హిమానీనదం వరకు లాజిస్టిక్స్ కార్యకలాపాలను నిర్వహించారు. 1999 మే నెలలో యుద్ధం ప్రారంభమవుతుందని తమకు అసలు తెలియదు. అయితే ఆ సమయంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి కారణంగా.. రెండేళ్ళ తన కొడుకును తన తోనే ఉంచుకోవలసి వచ్చింది. పిల్లవాడిని కమాండ్‌లో ఉంచడానికి అనుమతి కోసం కమాండింగ్ అధికారిని అడిగాను.. అధికారి అంగీకరించారు. అలా ఓవైపు చిన్నారి బాలుడి పెట్టుకుని మరీ యుద్ధంలో శత్రువులపై పోరాడినట్లు చెప్పిన యశికా గురించి తెల్సిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆర్మీ నుంచి రిటైర్ అయిన యాషికా త్యాగి మోటివేషనల్ స్పీకర్ , నాయకత్వ శిక్షకురాలిగా పనిచేస్తున్నారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..