World Snake Day: పాము కరిస్తే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడండి.. ప్రాధమిక చికిత్సే అమూల్యం..

ప్రకృతిలో ఉన్న జీవుల్లో పాములు ఒకటి. పాములు లేదా వేరే ఇతర జీవులు ఏవైనా సరే ప్రకృతిలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ప్రతి సంవత్సరం నేడు, (జూలై 16న) ప్రపంచ పాముల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు పాముల గురించి అవగాహన కల్పిస్తారు.. పాములకు ఉన్న ప్రాముఖ్యతని గురించి వివరిస్తారు. ప్రతి పాము విషపూరితం కాకపోయినా సరే పాములు అంటే ప్రజలు భయం. ఈ రోజు పాము కాటు వేస్తే ప్రాధమిక చికిత్స గురించి తెలుసుకుందాం..

World Snake Day: పాము కరిస్తే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడండి.. ప్రాధమిక చికిత్సే అమూల్యం..
World Snake Day

Updated on: Jul 16, 2025 | 12:14 PM

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నా.. వీటిల్లో చాలా జాతులు ప్రమాదకరమైనవి కావు. కేవలం 52 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి. అయితే ఎటువంటి పాము కనిపించినా భయపడతారు. అయితే కొన్ని సార్లు పాము కాటుకి గురవుతారు. ఇలాంటి సమయంలో బాధితులు ముందుగా బయపదకునా దైర్యంగా ఉండాలి. ప్రతి కాటు విషపూరితమైన పాము అయినా కాకపోయినా.. దానిని తీవ్రంగా పరిగణించాలి. పాము కాటు వేసిన వెంటనే సరైన ప్రథమ చికిత్స, తరువాత సత్వర వైద్య సహాయం అందించాలి. అప్పుడే ప్రాణాలను కాపాడ వచ్చు. లేదా పాము కాటు వలన కలిగే తీవ్రమైన సమస్యలను నివారించగలదు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. మన దేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. కొన్ని రకాల పాములు కరిస్తే మాత్రం 3 గంటల్లో మనిషి మరణించవచ్చు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. అందుకనే మొదటి కొన్ని నిమిషాల్లో సరిగ్గా స్పందించడం ముఖ్యం. పాము విషపూరితమైనదా కాదా అనేది గుర్తించి.. అందుకు తగిన విధంగా స్పందించాలి. ఎవరైనా పాము కాటుకి గురైతే ఎటువంటి ప్రాధమిక చికిత్స అందించాలి.. పాము కాటుకు గురైతే ఏమి చేయాలి? ఏమి చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

పాము కాటు వేసిన వెంటనే ఏమి చేయాలంటే..

పాము కాటు వేసిన చోట ఎన్ని గాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

పాము కాటు వేస్తే ముందు చాలా ప్రశాంతంగా .. స్థిరంగా ఉండాలి.

వీలైనంత ప్రశాంతంగా.. నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నించాలి. పాము కాటుకి భయపడి శరీరాన్ని కదిలించవద్దు. ఇలా చేస్తే శరీరంలో విషం వ్యాపిస్తుంది.

వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేసి ఈ విషయాన్నీ తెలియజేయండి.

పాము కాటుకు చికిత్స చేసే సమయంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం.

ఎక్కడ పాము కాటు వేస్తె.. ఆ ప్రభావితమైన అవయవాన్ని ఎట్టి పరిస్థితిల్లో కదిలించవద్దు.

విషం వ్యాప్తి చెందకుండా ఉండటానికి కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా.. గుండె స్థాయిలో లేదా కొంచెం క్రింద ఉంచండి.

బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే వెంటనే లూజ్ చేయండి. ఆభరణాలను తీసివేయండి

గాయాన్ని సున్నితంగా శుభ్రం చేయండి:

కాటు వేసిన ప్రదేశాన్ని శుభ్రమైన నీరు , సబ్బుతో సున్నితంగా కడగవచ్చు. అయితే గాయాలను ఎక్కువగా కడగవద్దు. గాయం దగ్గర ఐస్ పెట్టవద్దు.

పాము విషాన్ని పీల్చడానికి పొరపాటున కూడా ప్రయత్నించవద్దు.

సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయడం వలన మనిషికి కొంచెం ప్రమాదం తగ్గినట్లే..

విషపు పాము కరిస్తే పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుంచి గుండెకు , గుండె నుంచి అన్ని శరీరభాగాలకు చేరుతుంది..ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. అందుకనే చాలామంది పాములంటే భయపడతారు. ఈ రోజు పాముల గురించి ఉన్న అపోహలను తొలగించి వాటిని సంరక్షించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పర్యావరణం కాపాడాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి పై ఉంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)