
మనం ఎక్కడ పని చేసినా లేదా మన పనితీరును ఉత్పాదకతతో కొలుస్తారు. కాబట్టి ఉత్పాదకతను కలిగి ఉండడంతో పాటు శాంతిని నిర్వహించడం చాలా కష్టమైన విషయం. ప్రతి క్షణం సాంకేతిక ఆవిష్కరణలతో వేగవంతమైన ఈ ప్రపంచంలో మనం పరుగెత్తుతున్నామని అనుకుంటాం. అలాగే తగినంత ఉత్పాదకత లేదని మనం తరచుగా భావిస్తాము. ఈ ప్రక్రియలో మనం చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాం. అయితే ఇదే సమయంలో మన మానసిక శ్రేయస్సును పట్టించుకోవడం లేదు . ఉత్పాదకంగా ఉండడం అంటే వ్యర్థాలను తొలగించడం. అంటే చేతిలో ఉన్న పని నుంచి మరింత లాభం పొందడానికి అన్ని ప్రక్రియలను క్రమబద్ధీకరించడం. అలా చేయడానికి, మరింత ఉత్పాదకతను సాధించడానికి మనం అనుసరించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. ప్రపంచ ఉత్పదకత దినోత్సవాన్ని మనం ఉత్పాదకతను ఎలా పెంచుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం కోసం జరుపుకుంటారు . ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడానికి కారణమైన తెలుసుకోవలసిన కొన్ని విషయాలను ఓ సారి చూద్దాం.
ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ ఉత్పాదకత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఉత్పాదకతను పెంచడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలను తెలుసుకుందాం. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో పరుగెత్తకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. అలాగే మనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు కష్టపడాలి. ముఖ్యంగా ఈ రోజు ప్రజలు ఉత్పాదకతను పెంచడంలో సహాయపడే సాధనాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా వారి పనిని మెరుగుపర్చుకుని మరింత ఉత్పాదకతపై దృష్టి పెడతారు. పని గంటలను పెంచడంతో పాటు వినూత్నంగా ఆలోచించాల్సి ఉంటుంది.
రోజు ఎలా మారుతుందో తెలుసుకోవడంతో పాటు దానిని ప్లాన్ చేయడం ముఖ్యం. గంట గంటకు ఉత్పాదకతను మెరుగుపరచడంలో, మరింత సృజనాత్మకంగా ఉండటానికి సమయాన్ని ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది.
ఉత్పాదక వ్యక్తులు సరైన పని, జీవిత సమతుల్యతను కలిగి ఉండవలసిన అవసరాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే ఎక్కువ పనితో తమను తాము కాల్చుకోకూడదని వారు విశ్వసిస్తారు. వారు తరచూ విరామాలు, సెలవులకు వెళతారు. ముఖ్యంగా ఇలా చేయడం ద్వారా మరింత ఫ్రెష్‌గా ఉంటూ పని చేస్తారు.
ఉత్పాదకత లేని వ్యక్తులు తాము కష్టమని భావించే పనుల గడువును ముందుకు తీసుకురావాలని నమ్ముతారు. ఇది వాటిని మరింత ఉత్పాదకత లేనిదిగా చేస్తుంది. ఉత్పాదక వ్యక్తులు, మరోవైపు, కష్టమైన పనుల్లో తలదూర్చి వినూత్న పరిష్కారాలను కనుగొంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..