Child Care Tips: సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ చాలాసార్లు పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు (Working Parents) పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మన్యూనత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లల్లో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం (Child Care) విషయంలో కొన్ని సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి అవేంటంటే..
అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర..
పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి అమ్మమ్మలు, తాతయ్యలతో కలిపి ఉంచడం మేలు. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
టైమ్ టేబుల్ సెట్ చేయండి..
పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్‌కు తీసుకెళ్లడం మంచిది. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలివెళుతున్నప్పుడు వారికి ఒక నిర్ధిష్టమైన టైమ్ టేబుల్‌ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి? ఎప్పుడు తినాలి? ఎప్పుడు ఆడుకోవాలి? ఎప్పుడు పడుకోవాలి? తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు కచ్చితంగా ఈ టైం టేబుల్‌ను పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్దిపెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీసుకు వెళ్లినా ఇంట్లోని పిల్లల పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి.
CCTV కెమెరాలను ఏర్పాటుచేయాలి..
మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో CCTV కెమెరాను ఇన్‌స్టాల్ చేయడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా వాటి యాక్సెస్ తల్లిదండ్రులిద్దరి మొబైల్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడో మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే గ్రహించి వారికి మార్గనిర్దేశం చేయవచ్చు.
మీ పరిస్థితులను వివరించండి..
ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైనవారు. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు, పిల్లలతో సరదాగా గడపండి మీరు ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.
వారంతాల్లో ..
మీరు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక, మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఇక వారంతాల్లో పూర్తి సమయాన్ని వారికే కేటాయించండి. పిల్లలతో విభిన్నపనులు ప్లాన్ చేయండి. వారికి ఇష్టమైన పనులు, వంటలు చేసి పెట్టండి. పిక్నిక్ కి, పార్క్ కి, మూవీకి తీసుకెళ్లండి.
Also Read:Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..
AIMIM: మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడితో పొత్తుకు AIMIM ప్రతిపాదన.. అయోమయంలో శివసేన..