పరగడుపునే పల్లీలు ఇలా తిన్నారంటే.. పుష్కలమైన ఆరోగ్యం.. లాభాలు తెలిస్తే..

వేరు శనగలు చాలా మంచి స్నాక్‌ ఐటమ్‌.. సాధారణంగా చాలా మంది పల్లీలను ఇష్టంగా తింటారు. కానీ, పల్లీలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ మాత్రమే కాదు.. మంచి పోషకాహారం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. పల్లీలను వేయించి కాకుండా నానబెట్టి తినడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

పరగడుపునే పల్లీలు ఇలా తిన్నారంటే.. పుష్కలమైన ఆరోగ్యం.. లాభాలు తెలిస్తే..
Soaked Groundnuts

Updated on: Nov 22, 2025 | 9:59 PM

పల్లీలలో అధిక ప్రోటీన్ ఉంటుంది. నానబెట్టడం వల్ల ప్రోటీన్ స్థాయిలు మరింత జీర్ణమయ్యేలా చేస్తుంది, శరీరానికి సరైన ప్రోటీన్‌ను అందిస్తుంది. నానబెట్టిన పల్లీలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఇది మన ఉత్పత్తి జరిగే ఎంజైమ్‌లను సహాయపడుతూ, హెల్తీ డైజేషన్‌ని ప్రోత్సహిస్తుంది. పల్లీలు ప్రోటీన్.. ఫైబర్‌లతో రిచ్‌గా ఉంటాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గడం సులభం అవుతుంది. నానబెట్టిన పల్లీల లో యాంటీ ఆక్సిడెంట్స్‌.. కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

పల్లీలలో ఉన్న మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు.. గుండె..ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పల్లీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫైబర్ ఉన్న పల్లీలు తింటే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్న పల్లీలు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. వేరు శనగల్లో ప్రోటీన్స్ ఫుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల దృఢత్వానికి సహాయపడతాయి. నానబెట్టిన పల్లీలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నానబెట్టిన పల్లీల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ప్రాణాంతక క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి.

పల్లీల్లోని ఐరన్, ఫోలెట్స్, కాల్షియం, జింక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింపజేస్తాయి. అధిక పనిభారం వల్ల చాలామంది వెన్నునొప్పితో బాధపడుతుంటారు. రోజంతా కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాంటి వారు రోజూ నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తింటే ప్రయోజనం చేకూరుతుంది. వేరుశనగల్లోని విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన పల్లీలు తినడం వల్ల పిల్లలు, పెద్దల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..