Goat Milk Benefits: మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? గాంధీ తాత ఇవే పాలు తాగేవారట..!

పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ పాలు తాగమని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే, కొందరు ఆవు పాలు తాగుతారు. మరికొందరు గేదె పాలు వాడుతుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా మేక పాలు ట్రై చేశారా..? అవును మేక పాలు కూడా తాగేందుకు ఉపయోగిస్తారు. మేక పాలు గేదె, ఆవు పాలకు భిన్నంగా ఉంటాయి. అంతేకాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, మేక పాలు ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయో పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

Goat Milk Benefits: మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? గాంధీ తాత ఇవే పాలు తాగేవారట..!
Goat Milk

Updated on: Nov 16, 2025 | 7:42 PM

గేదె, ఆవు పాల కంటే మేక పాలు మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేకపాలలో పోషకాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. ఈ పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మేక పాలలో అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. అందువల్ల, ఈ పాలు తాగడం ద్వారా మనం అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మేక పాలు సులభంగా జీర్ణమవుతాయి. అలెర్జీ కారకాలు తక్కువగా ఉంటాయి.

మేక పాలలో సెలీనియం, జింక్, విటమిన్లు ఎ, సి ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మేక పాలలో ఉండే కొవ్వు గోళాలు చిన్న పరిమాణంలో ఉండటం వలన, శరీరం దానిని సులభంగా జీర్ణం చేసుకుంటుంది. ఇది కడుపులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. మేక పాలలో లాక్టోస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.

కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి, ఎముకల బలాన్ని పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి శరీర సమస్యలను నివారిస్తుంది. మేక పాలలో శరీరంలో మంటను తగ్గించే గుణం ఉంది. ఇది పిత్త సమస్యలను తగ్గిస్తుంది. మేకపాలలో ఎక్కువగా కాల్షియం, విటమిన్ ఎ, బి6లు ఉంటాయి. వీటిని తాగడం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. ఆందోళన తగ్గుతుంది. రక్తహీనత సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు మరిన్నీ లాభాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మేకపాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఓ పరిశోధనలో ఆవు పాలు తాగిన ఎలుకల కంటే మేకపాలు తాగిన ఎముకల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. ఇందులోని గుణాలు బ్రెయిన్ డెవలప్‌‌మెంట్‌కి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. ఈ పాలని తీసుకోవడం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది.

మేక పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మ కాంతి, సంరక్షణకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ పాలు మహిళల్లో హార్మోన్ల మార్పులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మేక పాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తికి మంచివి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..