ఇదో వింత వ్యాధి.. 60రోట్టెలు తిన్నా ఆకలి తీరని రోగం..! చికిత్స లక్షల్లోనే..
అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ దాదాపు 60 రోటీలు తింటుంది. అయినప్పటికీ ఆమెకు ఆకలి తీరదు. ఇదే ఆ వింతరోగం. ఈ వ్యాధితో బాధపగుతున్న వ్యక్తి రోజంతా ఆకలితో ఉంటాడు. ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. దీనికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాధికి గల కారణాలు, లక్షణులు, నివారణ మార్గాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక స్పెషల్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి లక్షణాలు బాధితులు రోజంతా ఆకలితో ఉంటారు. ఎంత తిన్నా కూడా వారికి ఆకలి తీరదు. బాధిత మహిళ తన చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అయినప్పటికీ ఈ వ్యాధికి అసలు కారణం ఏంటో ఇప్పటి వైద్యులు గుర్తించలేకపోయారు. నేటికీ ఈ వ్యాధికి గల కారణాల్లేంటో వెల్లడి కాలేదని తెలిసింది. బాధిత మహిళ మంజు కుటుంబం మాట్లాడుతూ ఆమె తరచుగా ఏదో ఒకటి తినకపోతే, ఆమె శరీరం శక్తిహీనంగా మారిపోతుందని చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి 3-4 రోట్టెలు తింటే ఆకలి తీరుతుంది. కానీ, మంజు ఒకేసారి కనీసం 10-12 రొట్టెలు తింటే గానీ ఆమెకు ఆకలితీరదని చెబుతున్నారు. అలా ఆమె రోజంతా దాదాపు 50 నుంచి 60కి పైగా తింటుందని చెప్పారు. దీని వెనుక కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం?
ఆకలి కాదు, అనారోగ్యమే అసలు కారణం:
అతిగా ఆకలి వేయడం అనేది సాధారణ శారీరక అనారోగ్యం కాదని, మానసిక ఆరోగ్య సమస్య అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. దీనిలో రోగి నిరంతరం ఆకలితో ఉంటాడు. అతను తినాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఇది సైకియాట్రిక్ డిజార్డర్ అని పిలువబడే మానసిక అనారోగ్యం కూడా అంటున్నారు.. కొన్నిసార్లు ఇది బింగే ఈటింగ్ డిజార్డర్ కారణంగా కూడా జరుగుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మీనాక్షి జైన్ ఇలా వివరించారు. ఇది అతిగా తినడం అనే సాధారణ విషయం మాత్రమే కాదు, దాని వెనుక తీవ్రమైన వైద్య సమస్య ఉందని చెప్పారు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఆహారం తిన్నప్పటికీ అతడు నిరంతరం ఆకలితో ఉన్నప్పుడు, అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా చెప్పారు.. అలాంటి సందర్భాలలో చికిత్స ఆలస్యం చేయడం మీ శరీరం, మనస్సు రెండింటికీ ప్రమాదకరమని చెప్పారు.
చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చయ్యాయి:
గత 3 సంవత్సరాలలో మంజు చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 5-7 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆమె చికిత్సకు ఇకపై తమ వద్ద డబ్బు లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు ఆమెకు పండ్లు తినమని సలహా ఇచ్చారు.
ప్రభుత్వం నుండి సహాయం కోసం విజ్ఞప్తి:
ఈ వ్యాధి కారణంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ కుటుంబం ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థాయి నుండి తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆ కుటుంబం చెబుతోంది. కానీ, ప్రభుత్వం ఇప్పుడు సహాయం చేస్తే తదుపరి చికిత్స సాధ్యమవుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








