శీతాకాలం మొదలైంది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సీజన్‌లో మరింత అనారోగ్యానికి గురవుతారు. ప్రజలు జలుబు, వైరల్ జ్వరం, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. కనుక తినే ఆహారం విషయంలో ప్రత్యెక శ్రద్ధ వహించాలి. మన రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరానికి శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ అంటున్నారు. కనుక శరీరాన్ని లోపలి నుంచి చెప్పిన సలహాలు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్: చలికాలంలో బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. అవి మంచి మొత్తంలో కొవ్వు , శక్తిని కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చలి నుంచి రక్షణ ఇస్తాయి.
నువ్వులు- బెల్లం: నువ్వులు, బెల్లం తీసుకోవడం ముఖ్యంగా శీతాకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందించి ఎముకలను దృఢంగా మార్చుతుంది. బెల్లం రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లి- అల్లం: వెల్లుల్లి , అల్లం తీసుకోవడం శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం వేడిని కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది. వెల్లుల్లి కూడా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వేడి సూప్- స్టీమింగ్: చారు, కిచ్డీ లేదా పసుపు పాలు తాగడం వల్ల చలికాలంలో శరీరానికి వెచ్చదనం అందుతుంది. పసుపు పాలు ఒక సహజ యాంటీబయాటిక్, ఇది జలుబు, దగ్గు నుంచి కూడా రక్షిస్తుంది.
నెయ్యి- వెన్న: చలికాలంలో నెయ్యి, వెన్న తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి.
ఆకు కూరలు: పాలకూర, మెంతి కూర, బతువా వంటి ఆకు కూరలు కూడా చలికాలంలో తినే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..