అమ్మ బాబోయ్.. మీ పార్ట్‌నర్‌కు పొరపాటున ఈ గిఫ్ట్స్ ఇచ్చినా.. మీ బంధం క్లోజే..!
స్పెషల్ డే వచ్చిందంటే.. భాగస్వామికి బహుమతులు ఇవ్వడం కామన్. కానీ కొన్ని గిఫ్టులు మీ సంబంధాన్ని విడదీస్తాయని, దురదృష్టాన్ని తెస్తాయని మీకు తెలుసా..? పొరపాటున కూడా ఈ 5 వస్తువులను అస్సలు ఇవ్వకూడదు.. ఎందుకంటే అవి మీ బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఏ వస్తువులు ఇవ్వకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వివాహ వార్షికోత్సవం, పుట్టినరోజు లేదా పండుగలు.. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో మీ పార్ట్‌నర్‌కు గిఫ్ట్స్ ఇవ్వడం అనేది సంబంధంలో ప్రేమను, బంధాన్ని పెంచుతుంది. అయితే కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం సంబంధంపై ఊహించని ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, అశుభంగా భావిస్తారని తెలుసా..? మీ దాంపత్య బంధం శాశ్వతంగా, సంతోషంగా ఉండాలంటే ఏ వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదో తెలుసుకుందాం.
భాగస్వామికి బహుమతులుగా ఇవ్వకూడని 5 వస్తువులు
బూట్లు – చెప్పులు
మీ భాగస్వామికి బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. ఈ బహుమతులు ఇవ్వడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య తరచుగా వాదనలు, కలహాలు తలెత్తే అవకాశం ఉందని, త్వరలోనే సంబంధంలో విడిపోయే ప్రమాదం వస్తుందని చెబుతారు. మీ బంధం పదిలంగా ఉండాలంటే వీటిని ఇవ్వడం మానుకోండి.
హాండ్ కర్‌చీఫ్ లేదా వాచ్
మీ భాగస్వామికి కర్చీఫ్ బహుమతిగా ఇవ్వడం వల్ల చెడు కాలాలు ప్రారంభమవుతాయని, ఇది దుఃఖాన్ని, విచారాన్ని సూచిస్తుందని నమ్ముతారు. వాచ్ బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధంలో అడ్డంకులు వస్తాయని, భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుందని అంటారు.
పెర్ఫ్యూమ్
పెర్ఫ్యూమ్ ఇవ్వడం రొమాంటిక్‌గా అనిపించినా ఇది సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుందని చెబుతారు. ఈ బహుమతి ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం చెడిపోతుందని అంటారు. మీరు సువాసన ఇచ్చే వస్తువు ఇవ్వాలనుకుంటే పెర్ఫ్యూమ్‌కు బదులుగా అత్తర్ ఇవ్వవచ్చు. అయితే అందులో ఆల్కహాల్ లేకుండా చూసుకోవడం ముఖ్యం.
నల్ల చీర లేదా నలుపు వస్తువులు
ముఖ్యంగా భర్త తన భార్యకు నల్ల చీరను బహుమతిగా ఇవ్వకూడదు. నల్లటి బట్టలు లేదా వస్తువులు అశుభంగా భావిస్తారు. వాటిని ఇవ్వడం వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తుతాయని, ఇది మీ సంబంధంలో విడిపోవడానికి లేదా క్షీణతకు దారితీస్తుందని చెబుతారు.
మునిగిపోతున్న ఓడ బొమ్మ
మునిగిపోతున్న ఓడ యొక్క చిత్రం లేదా దాని బొమ్మను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. అలాంటి వస్తువులు సంఘర్షణకు, ఆర్థిక నష్టాలకు కారణమవుతాయని నమ్ముతారు. అంతేకాకుండా అలాంటి వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల మీ భాగస్వామికి కూడా హాని కలుగుతుందని చెబుతారు.
మీ భాగస్వామికి ఇవ్వడానికి ఉత్తమ బహుమతులు
మీ సంబంధంలో ఆనందాన్ని, ప్రేమను పెంచే కొన్ని ఉత్తమ బహుమతులు ఇక్కడ ఉన్నాయి
పువ్వులు: పెర్ఫ్యూమ్‌కు బదులుగా సువాసనగల పువ్వులు ఇవ్వడం ఉత్తమం.
ఆభరణాలు: వెండి లేదా బంగారు ఆభరణాలు ఇవ్వడం శ్రేయస్కరం.
పుస్తకాలు: మీ భాగస్వామి చదవడానికి ఇష్టపడితే, వారికి నచ్చిన మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.
రొమాంటిక్ డేట్: మీ భాగస్వామితో కలిసి రొమాంటిక్ డిన్నర్ డేట్‌కు లేదా మంచి ప్లేస్‌కి వెళ్లడం అనేది అత్యుత్తమ అనుభూతిని ఇచ్చే బహుమతి.
(Note: పైన పేర్కొన్న సమాచారం అందుబాటులో ఉన్న అంశాల నుంచి అందించబడింది. దీని యొక్క వాస్తవాల గురించి మేము ఎటువంటి వాదనలు చేయము లేదా మూఢనమ్మకాలను ఆమోదించము..)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




