Black Hair Tips: ఈ నూనె రాస్తే.. తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారాల్సిందే!

|

Oct 14, 2024 | 2:57 PM

తెల్ల జుట్టు.. ఒకప్పుడు 50 లేదా 60 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే తెల్ల జుట్టు కనిపిస్తుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల నలుగురిలోకి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సింది. ఈ క్రమంలోనే జుట్టుకు రంగులు వేస్తున్నారు. దీని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. జుట్టు అనేది తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తలలో మెలనిన్ అనే సమ్మేళనం నలుపు రంగును ఇస్తుంది. ఇది తగ్గితే జుట్టు అనేది తెల్లగా..

Black Hair Tips: ఈ నూనె రాస్తే.. తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారాల్సిందే!
Black Hair Tips
Follow us on

తెల్ల జుట్టు.. ఒకప్పుడు 50 లేదా 60 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే తెల్ల జుట్టు కనిపిస్తుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల నలుగురిలోకి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సింది. ఈ క్రమంలోనే జుట్టుకు రంగులు వేస్తున్నారు. దీని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. జుట్టు అనేది తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తలలో మెలనిన్ అనే సమ్మేళనం నలుపు రంగును ఇస్తుంది. ఇది తగ్గితే జుట్టు అనేది తెల్లగా మారుతుంది. అందుకనే కొందరిలో చిన్న వయసులోనే జుట్టు అనేది తెల్లగా వస్తుంది. అయితే ఈ మెలనిన్‌ని జుట్టుపై మెరుగు పరచుకోవచ్చు. నల్ల జుట్టును తెల్లగా మార్చేందుకు ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఎంతో చక్కగా పని చేస్తుంది. ఎలాంటి వారైనా ఉపయోగించుకోవచ్చు.

కానుగ చెట్టు..

కానుగ చెట్టుకు గురించి ఇప్పటి వయసులో ఉన్నవారికి తెలియకపోయినా.. మీ ఇంట్లో పెద్దవారికి తెలిసే ఉంటుంది. ఇది చెట్టు చాలా పెద్ద వృక్షంగా ఉంటుంది. ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. కాయల్లో ఉండే గింజల నుంచే నూనె తీస్తారు. దీన్నే కానుగ నూనె అంటారు. ఇది మనకు బయట మార్కెట్లో లభిస్తుంది. ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ కానుగ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ తీసుకొచ్చి ఒక పాత్రలో వేసి.. నల్లగా మారేంత వరకూ మరిగించాలి.

జుట్టుకు బాగా పట్టించండి..

ఇప్పుడు ఈ ఆయిల్‌లో కొన్ని రకాల సమ్మేళనాలు రిలీజ్ అవుతాయి. ఇలా మరిగిన నూనె నుంచి మూడు చుక్కల ఆయిల్ తీసుకుని.. అందులో తగినంత కొబ్బరి నూనె కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత కుదుళ్లకు సున్నితంగా మర్దనా చేయండి. అనంతరం ఓ గంట సేపు ఉంచి తలస్నానం చేయాలి. లేదంటే రాత్రి ఈ నూనె పెట్టి ఉదయం కూడా హెడ్ బాత్ చేయవచ్చు. ఇలా వారంలో రెండు సార్లు అయినా చేయాలి.

ఇవి కూడా చదవండి

మంచి రిజల్ట్ ఉంటుంది..

ఇలా తరచూ ఈ ఆయిల్ పెట్టి.. స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరలోనే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇతర హెయిర్ డైల కంటే ఈ చిట్కా ఖచ్చితంగా వర్క్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..